33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!

- November 18, 2025 , by Maagulf
33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!

మనామా: బహ్రెయిన్ లో 33వ ఎడిషన్ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. సఖిర్‌లోని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్‌లో ఈ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ను టూరిజం మినిస్టర్ ఫాతిమా బింట్ జాఫర్ అల్-సిరాఫీ ప్రారంభించారు. అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ బహ్రెయిన్‌ను లగ్జరీ వాణిజ్య ప్రదర్శనలకు ప్రధాన గమ్యస్థానంగా నిలిపిందని తెలిపారు.  బహ్రెయిన్ పర్యాటక అభివృద్ధికి ఇలాంటి అంతర్జాతీయ ప్రదర్శనలు దోహదం చేస్తాయని పేర్కొన్నారు. 

"అరబ్ ఆభరణాల ప్రదర్శన ఈ ప్రాంతంలోని అత్యంత విశిష్టమైన ప్రత్యేక కార్యక్రమాలలో ఒకటి, ఇది సందర్శకులకు సృజనాత్మకతను లగ్జరీ టచ్ తో కలిపే గొప్ప అనుభవాన్ని అందిస్తుంది" అని టూరిజం మినిస్టర్ ఫాతిమా అన్నారు.  

అరబ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌లో 29 దేశాల నుండి 659 మంది, అరబ్ పెర్ఫ్యూమ్ ఎగ్జిబిషన్‌లో 6 దేశాల నుండి 51 మంది ఎగ్జిబీటర్స్ పాల్గొంటున్నారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com