సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- November 18, 2025
కువైట్: సాల్మియా ప్రాంతంలో పార్క్ చేసిన అనేక వాహనాలను ఓ వ్యక్తి ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, కార్ల అద్దాలను పగలగొట్టిన వ్యక్తిని గుర్తించారు. అతను విజిట్ వీసాపై ఉన్న కెనడియన్ పౌరుడని, అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు సెక్యూరిటీ డైరెక్టరేట్ ప్రకటించింది.
సదరు వ్యక్తి డ్రగ్స్ ను అధికంగా తీసుకున్నాడని, ఆ మత్తులో అతను ఏడు వాహనాల అద్దాలను ధ్వంసం చేశాడని పేర్కొన్నారు. అతడిపై సాల్మియా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని తెలిపారు. విధ్వంసక చర్యలు లేదా ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని పోలీసులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..







