ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- November 18, 2025
న్యూ ఢిల్లీ: మళ్లీ ఢిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి.కొందరు అజ్ఞాత దుండగులు విద్యాసంస్థలు, కోర్టులను లక్ష్యంగా చేసుకొని బెదిరింపుల సందేశాలను పంపారు. పాటియాలా హౌస్, సాకేత్ కోర్టు, రెండు సీఆర్పీఎఫ్ స్కూల్స్కి కూడా బెదిరింపులు అందినట్లు సమాచారం.గుర్తు తెలియని వ్యక్తులు ఈ బెదిరింపులను మెయిల్ ద్వారా పంపినట్లు వెల్లడమయ్యింది. అధికారులు వెంటనే అప్రమత్తమై స్థలాల్లో తనిఖీలు నిర్వహించారు. తప్పుడు హెచ్చరికగా ఉన్నందున ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని తెలుసుకొని పరిస్థితి సడలింది.
ఇంతలో, ఇటీవల ఎర్రకోట వద్ద సంభవించిన బాంబు పేలుడు గుర్తుకు తెచ్చుకుంటోంది, ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా బెదిరింపులు అధికారులను మరియు ప్రజలను ఆందోళనలో పడేస్తున్నాయి. అయినప్పటికీ, ఢిల్లీలో బాంబు బెదిరింపులు కొత్తగా వచ్చిన విషయం కాదు. గతంలో కూడా పలు స్కూల్లు, విమానాలు, ఇతర కేంద్రాల పై గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







