రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!

- November 18, 2025 , by Maagulf
రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!

దుబాయ్: యూఏఈలో రెండు సంవత్సరాల క్రితం 39 ఏళ్ల భారతీయుడు రాకేష్ కుమార్ జాంగిద్‌ తప్పిపోయాడు. అతడి ఆచూకీని కనుగొనడంలో సహాయపడే ఏదైనా సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డును దుబాయ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ ప్రకటించారు.

రాకేష్ కుమార్ ఆచూకీని తెలియజేయాలని అతడి కుటుంబం వీడియోను చూసిన తర్వాత వారికి సాయం చేయాలని భావించినట్టు పాంథియోన్ డెవలపర్స్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ కల్పేష్ కినారివాలా తెలిపారు.   తాను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తండ్రిని కోల్పోయానని కినారివాలా ఎమోషనల్ అయ్యాడు. రాకేష్ దూరమవ్వడం వారి కుటుంబం ఎదుర్కొంటున్న బాధ ఏమిటో తనకు తెలుసన్నారు. అందుకే రాకేష్ ఆచూకీని గుర్తించడంలో సాయం చేసే వారికి రివార్డు అందజేయనున్నట్లు  పేర్కొన్నారు.  

దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్‌ తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు కినారివాలా చెప్పారు. రివార్డ్ ప్రకటన ద్వారా అందిన ఏదైనా విశ్వసనీయమైన ఆధారాన్ని కేసును నిర్వహించే అధికారులకు అందజేయబడుతుందని ఆయన అన్నారు.

భారత్ లోని రాజస్థాన్‌కు చెందని రాకేష్, ఉద్యోగం కోసం 2023 జూన్ 21వ తేదిన 60 రోజుల యూఏఈ టూరిస్ట్ వీసాపై దుబాయ్ వచ్చాడు. రెండు వారాల తర్వాత అతను కనిపించకుండా పోయాడు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com