ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- November 21, 2025
అమరావతి: కృష్ణా జలాల అంశంపై మాజీ సీఎం జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి లేఖ రాశారు. కృష్ణా జల వివాదాల 2వ ట్రైబ్యునల్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని లేఖలో కోరారు.కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్ర హక్కులు, ప్రయోజనాలు కాపాడడంలో కూటమి ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధితో పని చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు.
కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం ట్రైబ్యునల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం చాలా పేలవమైన వాదనలు వినిపిస్తోందని జగన్ అన్నారు. కెడబ్ల్యూడీటీ-2 విచారణలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అనిల్‌కుమార్ గోయల్ వాదన దారుణంగా ఉందన్నారు. కృష్ణా జలాలపై మనకున్న హక్కు, ఆ జలాలు వాడుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం లేని చిత్తశుద్ధిని స్పష్టం చేస్తోందన్నారు. అది ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు.
”ప్రభుత్వం కూడా తుది వాదనలు వినిపించే అవకాశం ఉంది కాబట్టి, కృష్ణా జలాలపై హక్కులు కాపాడుకోవడానికి, ఆ నీటి వినియోగానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు ట్రైబ్యునల్ ఎదుట వినిపిస్తున్న కొన్ని వాదనలు చట్ట పరిమితిని మించడం ఆందోళన కలిగిస్తోంది. అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 6(2), కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గెజిట్ మేరకు, నదీ జలాల వివాదాల విషయంలో ట్రైబ్యునల్దే తుది నిర్ణయం. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కు, ఆ నీటి వినియోగంలో మన ప్రయోజనాలు కాపాడడంలో, మీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, అలక్ష్య ధోరణి వల్లే పొరుగు రాష్ట్రాలు ఆ విధంగా చురుకుగా వ్యవహరిస్తున్నాయి.
ఇది మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేయనుంది. మధ్య రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని మళ్లీ ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నా. గతంలో మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైంది. తిరిగి ఈరోజు అదే పరిస్థితి ఉత్పన్నమవుతోంది. అదే సమస్య ఎదురవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీరు రాజీ పడతారన్న అభిప్రాయం అందరిలో బలంగా వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రజల తాగు, సాగునీటి అవసరాలు తీరేలా నీటిలో మన హక్కు అయిన వాటా కోసం మీరు చిత్తశుద్ధితో పని చేయాలని, ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి” అని లేఖలో కోరారు జగన్.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







