దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- November 21, 2025
దుబాయ్: దుబాయ్లో నిర్వహిస్తున్న ఎయిర్ షోలో పాల్గొన్న తేజస్ యుద్దవిమానం శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు కూలిపోయిందని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. HAL తయారు చేసిన ఈ యుద్ద విమానం స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో ఎయిర్ ఫో చేస్తుండగా అదుపు తప్పి తేజస్ యుద్దవిమానం కూలిపోయినట్టు తెలుస్తోంది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయని..అలాగే భారీ ఎత్తున పొగలు వచ్చినట్టు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్ని సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదాన్ని చూసిన ప్రదర్శనను వచ్చిన ప్రేక్షకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే విమానం నడుపుతున్న పైలట్ ప్రమాదం నుంచి బయటపడ్డాడ లేదా ఫ్లైట్లోనే ఉండిపోయాడా అనేది స్పష్టం కాలేదు. అతని ఆచూకీ గురించి అధికారులు గాలింపు చేపట్టారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!
- పబ్లిక్ హెల్త్ ప్రమోషన్లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!
- ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం







