సత్యసాయి సేవల ను కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
- November 22, 2025
పుట్టపర్తి: పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.
విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఆయన సందేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారన్నారు. 1969 నుంచే మహిళా సంక్షేమానికి బాబా ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు.
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. “‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’ అనేదే బాబా సిద్ధాంతమని, ఆయన ప్రవచించిన పంచ సూత్రాలు పాటిస్తే ప్రపంచం శాంతితో వర్ధిల్లుతుందని అన్నారు. “సత్యసాయి బాబాతో నాకు మంచి అనుబంధం ఉంది. తాగునీటి ప్రాజెక్టుల కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టడానికైనా ఆయన సిద్ధపడ్డారు.
బాబాతో నాకు మంచి అనుబంధం ఉంది: సీఎం చంద్రబాబు
ఆయన స్ఫూర్తితో భక్తులు పెద్ద ఎత్తున విరాళాలిచ్చి ఆ ప్రాజెక్టులను పూర్తి చేశారు” అని గుర్తుచేసుకున్నారు. సత్యసాయి ట్రస్ట్ 140 దేశాల్లో 2 వేలకు పైగా శాఖలతో, 7.50 లక్షల మంది వాలంటీర్లతో సేవలందించడం అద్భుతమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ‘సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం’ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ రన్.. మెట్రో సర్వీస్ టైమ్ పొడిగింపు..!!
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు రండి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం
- ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యం..కఠిన ఆంక్షలు
- సత్యసాయి సేవల ను కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు
- లొంగిపోయిన 37మంది మావోయిస్టులు..
- అల్ మషాఫ్ హెల్త్ సెంటర్లో ICOPE క్లినిక్ ప్రారంభం..!!
- సీజనల్ ఇన్ఫెక్షన్లు..పెరుగుతున్న HFMD కేసులు..!!
- ఫేక్ బిల్ పేమెంట్స్ మెసేజుల పై విద్యుత్ శాఖ హెచ్చరిక..!!
- ముసుగు ధరించి అల్లర్లు..పలువురు అరెస్ట్..!!
- జోహన్నెస్బర్గ్ చేరుకున్న సౌదీ విదేశాంగ మంత్రి..!!







