ఆస్ట్రేలియా కొత్త వీసా పాలసీ..
- November 24, 2025
ఆస్ట్రేలియా ప్రభుత్వం గతేడాది (2024) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతుల్ని, పరిశోధకులను, ఇన్నోవేటర్లను ఆకర్షించేందుకు కొత్త వీసా పాలసీని ప్రవేశపెట్టింది. దీనికే నేషనల్ ఇన్నోవేషన్ వీసా అని పేరు.ఈ వీసా ద్వారా నేరుగా పర్మినెంట్ రెసిడెన్సీ (PR) ను పొందే అరుదైన అవకాశం లభిస్తోంది.
తమ దేశంలో నిపుణులను పెంచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.. అయితే చాలామందికి ఈ వీసా గురించి అంతగా తెలియదు.ఈ వీసా లభిస్తే ఉద్యోగంతో పాటు ఫ్రీగా పర్మినెంట్ రెసిడెన్సీ కూడా ఇస్తారు.
దీంతోపాటు ఉండడానికి ఇల్లు, పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్..ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.మీలో ఏదైనా గొప్ప ట్యాలెంట్ ఉంటే చాలు.ఈ వీసా ఈజీగా లభిస్తుంది.ఏదైనా వృత్తిలో మీరు నిపుణులు అయినా లేదా పరిశోధనా రంగంలో అద్భుతమైన విజయాలు సాధించినా ఈ వీసాకు అప్లై చేసుకోవచ్చు.అలాగే రకరకాల కళాకారులు, అథ్లెట్లు కూడా ఈ వీసాకు అర్హులే.
అయితే ఈ వీసా రావాలంటే మీ టాలెంట్ కు గానూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉండాలి. ఏవైనా అవార్డులు, సర్టిఫికేట్లు ఉన్నా సరిపోతుంది.ఇలాంటి వారికి పిలిచి ఫ్రీగా పర్మినెంట్ రెసిడెన్స్ ఇస్తారు.ఇదొక పర్మనెంట్ వీసా ప్రోగ్రామ్.అంటే మీరు ఆస్ట్రేలియాలో శాశ్వతంగా నివసించవచ్చు, పని చేయవచ్చు, చదువుకోవచ్చు.
ఆస్ట్రేలియా ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ పథకంలో కూడా చేరొచ్చు.అలాగే మీ కుటుంబ సభ్యులను కూడా ఇందులో చేర్చుకోవచ్చు.ఇన్నోవేషన్ వీసా (Australia Visa) లభిస్తే.. మీకు కొంతకాలం పాటు పర్మినెంట్ రెసిడెన్సీ లభిస్తుంది.మీరు ఒక నాలుగు సంవత్సరాలు చట్టబద్ధంగా ఆస్ట్రేలియాలో నివసిస్తే.. ఆ పైన మీకు ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా లభిస్తుంది.ఈ వీసా దరఖాస్తులో అత్యంత ముఖ్యమైన భాగం నామినేటర్ కలిగి ఉండటం.
అంటే మీరు ఈ వీసాకు అప్లై చేయాలంటే, మీ రంగంలో జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులున్న ఒక వ్యక్తి లేదా సంస్థ మీ గురించి సిఫార్సు చేయాలి.అలాగే ఆ నామినేటర్.. ఆస్ట్రేలియా పౌరుడు లేదా సంస్థ అయ్యి ఉండాలి లేదా ఆస్ట్రేలియా/న్యూజిలాండ్ పర్మనెంట్ రెసిడెంట్ అయి ఉండాలి. మీరు ఈ వీసాకు నేరుగా అప్లై చేయడానికి వీలు లేదు. అప్లై చేయాలంటే ముందుగా నామినేటర్ ఉండాలి. ఆ తర్వాత ఆస్ట్రేలియా హోం అఫైర్స్ డిపార్ట్మెంట్ పోర్టల్లో తమ వివరాలతో EOI (Expression of Interest) ని సమర్పించాలి.
ఇది మొదటి స్టెప్. ఆ తర్వాత మీ EOI తో డిపార్ట్మెంట్ సంతృప్తి చెందితే మీకు అధికారికంగా దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానం పంపుతుంది. ఆ ఇన్విటేషన్ అందిన తర్వాత దరఖాస్తుదారులు 60 రోజుల్లోగా అవసరమైన పత్రాలు (అవార్డులు, ప్రచురణలు, పేటెంట్లు, మీడియా కవరేజ్) వంటివి జతచేసి దరఖాస్తు సమర్పించాలి. వీటిని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆమోదిస్తే మీకు వీసా (Australia Visa) లభిస్తుంది.
తాజా వార్తలు
- TG గ్లోబల్ సమ్మిట్-2025 లోగో విడుదల
- ప్రముఖ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
- న్యూ ఇయర్ వేడుకపై తెలంగాణ పోలీసుల స్పెషల్ డ్రైవ్
- శ్రీశైలం భక్తులకు అలర్ట్..
- సుప్రీంకోర్టు సిజేఐగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ సూర్యకాంత్
- యూత్ ఐకాన్ అవార్డు అందుకున్న బోల్లా శ్రీకాంత్ బొల్ల
- ఆస్ట్రేలియా కొత్త వీసా పాలసీ..
- 2026లో భారత్లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- తేజస్ ప్రమాదం తర్వాత షో కొనసాగించటం: US పైలట్ షాకింగ్ రియాక్షన్
- ఒమన్, జోర్డాన్ మధ్య హైలెవల్ మీటింగ్..!!







