2026లో భారత్‌లో ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’
- November 24, 2025
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన తాజా G20 శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని, సదస్సులో కీలక ప్రసంగం చేయడంతో పాటు, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జపాన్ ప్రధాని సనే టకాయిచిలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.G20 సదస్సు లో “అందరికీ న్యాయమైన భవిష్యత్తు” అనే అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు.
టెక్నాలజీ వినియోగం ఆర్థిక కేంద్రంగా కాకుండా మానవ కేంద్రంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. 2026 ఫిబ్రవరిలో “సర్వజనం హితాయ, సర్వజనం సుఖాయ” అనే నినాదంతో భారత్ ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’కు ఆతిథ్యం ఇవ్వనుందని, ఈ సదస్సులో పాల్గొనాలని G20 దేశాలను ఆహ్వానించారు.
కృత్రిమ మేధ (AI) విషయంలో పారదర్శకత, మానవ పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అరికట్టడం వంటి సూత్రాలతో ప్రపంచ ఒప్పందం అవసరమని నొక్కి చెప్పారు.సదస్సు నిర్వాహక దేశమైన దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వాణిజ్యం, పెట్టుబడులు, కృత్రిమ మేధ, కీలక ఖనిజాలు వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. భారత్‌కు చీతాలను తరలించినందుకు రమఫోసాకు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







