రాజ్మా బిర్యాని
- July 25, 2016
కావాల్సిన పదార్థాలు
రాజ్మా : పావు కప్పు బియ్యం (బాస్మతి లేదా వేరే బియ్యం) : రెండు కప్పులు నెయ్యి : 2 టేబుల్ స్పూన్లు పుదీనా (తరుగు) : అర కప్పు కొత్తిమీర (తరుగు) : కప్పు ఉల్లిపాయలు : 2 అల్లంవెల్లుల్లి పేస్టు : 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు : నాలుగు యాలకులు : రెండు లవంగాలు : నాలుగు దాల్చిన చెక్క : చిన్నది జీలకర్ర : టీ స్పూన్ పలావ్ ఆకులు : రెండు జీడిపప్పులు : ఆరు నూనె : మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు : తగినంత
తయారు చేయు విధానం:
ఒక రోజు రాత్రంతా రాజ్మగింజలను నానబెట్టాలి. బాగా నానితే ఇవి బాగా ఉడుకుతాయి. బియ్యం కడిగి పది నిమిషాల పాటు నానపెట్టాల్సి ఉంటుంది. స్టవ్ వెలిగించి కొంచెం నెయ్యి వేసి అందులో జీడిపప్పులను వేయించి పక్కకు పెట్టుకోవాలి. తరువాత గిన్నె పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి యాలకులు, లవంగాలు, చెక్క పలావ్ ఆకు, జీలకర్ర వేసి వేయించి పక్కకు పెట్టుకోవాలి. పుదీన ఆకుల్ని పేస్టు చేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డల ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు, రాజ్మా గింజలు, పుదీన పేస్టు ఒకటి తరువాత ఒకటి వేసి మంచిగా కలుపుతూ వేయించాలి. తరువాత బియ్యం వేసి ఐదు నిమిషాల పాటు వేయించి మూడున్నర కప్పుల నీళ్ళు పోసి, ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ఉడికిన తరువాత జీడిపప్పులు, కొత్తిమీర వేసి మూతపెట్టేయాలి. ఇక రాజ్మా బిర్యానీ రెడీ.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







