తొమ్మిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారు
- July 25, 2016
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఢాకాలోని ఓ భవనాన్ని ముట్టడించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా బలగాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 9మంది ఉగ్రవాదులు మృతిచెందారు. వీరంతా అనుమానిత ఐఎస్ ఉగ్రవాదులుగా భావిస్తున్నారు. ఈ ఘటనను ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ (డీఎంపీ) మసూద్ అహ్మద్ ధ్రువీకరించారు. రెండు గంటలసేపు జరిగిన ఎదురెదురు కాల్పుల్లో తొమ్మిది మంది ఇస్లామిక్ ఉగ్రవాదులు హతమయ్యారని, ఒకరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కల్యాణ్‌పూర్ సమీపంలో ఉగ్రవాదులు ఒక భవంతి నుంచి బాంబులు విసురుతుండగా చుట్టుముట్టామని, రాత్రి నుంచి ఎదురెదురు కాల్పులు జరిగాయని చెప్పారు. ఇస్లామిక్ సాయుధులు కాల్పులు జరుపుతూ మధ్యమధ్యలో అల్లాహో అక్బర్ ఉంటూ నినాదాలు చేసినట్టు చెప్పారు. ఆపరేషన్ స్టార్ 26 పేరుతో సాయుధపోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సమర్ధవంతంగా ఉగ్రవాదులను మట్టుపెట్టినట్టు ఢాకా అడిషనల్ పోలీస్ కమిషనర్ షేక్ మరుఫ్ హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







