ప్రవాసీయ భారతీయుడు అబూ ధాబీ విమానాశ్రయం వద్ద గుండెపోటుతో మృతి
- July 25, 2016
అబూ ధాబీ: పిల్లల చదువు కోసం సెలవు తీసుకొని స్వదేశానికి వచ్చే యత్నంలో ఓ ప్రవాసేయ భారతీయుడు గుండెపోటుకు గురై మరణించాడు. సోమవారం వేకువజామున జరిగిన ఈ విషాదకర సంఘటనలో బెంగళూరుకు వెళ్ళాల్సిన ఆ వ్యక్తి విమాన బోర్డుకు చేయకముందే అబూ ధాబీ విమానాశ్రయం వద్ద తీవ్రమైన గుండెపోటుకు గురై చనిపోయారు.దుబాయ్ లోని ఒక వర్తక సంస్థలో జార్జ్ ఫిలిప్,(55) ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ తెల్లవారుజామున ఇ-గేట్ కౌంటర్ వద్ద వేచి ఉండగా అకస్మాత్హుగా గొండెనొప్పి రావడంతో జార్జ్ ఫిలిప్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారని కుటుంబ స్నేహితుడు " మా గల్ఫ్ డాట్ కామ్ " తెలిపారు. కేరళ నుంచి వచ్చిన జార్జ్ ఫిలిఫ్, అబూ ధాబీలో ఉన్నతన అపార్ట్మెంట్ నుండి విమానాశ్రయం బయలుదేరే ముందు ఒక ఇబ్బందికరమైన మరియు తీవ్రమైన ఛాతీ నొప్పి అనుభవించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఆ సూచనని జార్జ్ ఫిలిఫ్ నిర్లక్ష్యం చేసి విమానాశ్రయానికి చేరుకొనేందుకు త్వరపడ్డాడు ఎందుకంటే అప్పటికే ఆయనకు సంబంధించి ఆన్లైన్ లో వీసా, పాస్పోర్ట్ తనిఖీ పూర్తికావడంతో ఒక టాక్సీని పిలిచాడు. తన పిల్లల విద్యా ప్రయోజనాల కోసం కుటుంబంతో సహా స్వదేశానికి విమానంలో వెళ్లేందుకు సిద్ధపడిన జార్జ్ ఫిలిఫ్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడంతో ఆ మళయాళ కుటుంబంలో అంతు లేని విషాదం నెలకొంది. విమానాశ్రయంలో మరణించిన ఆయన కుమార్తె లా విద్యలో ఉన్నత విద్య కోసం మంగళవారం ( నేడు ) మైసూరులో హాజరు కావాల్సిఉంది. ఆయన కుమారుడు ఇప్పటికే అక్కడ లా చదువులో పట్టభద్రుడు కాబడి తన సెలవుల్లో సందర్శన కోసం తండ్రి వద్దకు ఇటీవల వచ్చేడు. తన తరగతులు సైతం మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. విమానాశ్రయం వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స మరియు సిపిఆర్ అందించారని జార్జ్ ఫిలిఫ్ స్నేహితుడు తెలిపారు. ఇది ఒక తీవ్రమైన గుండెపోటు వారు ఆల్ మఫ్రాక్ హాస్పిటల్ అతన్ని హడావిడిగా తీసుకొనివచ్చారు కానీ, అప్పటికే ఆయన చనిపోయారని ఆస్పత్రివర్గాలు పేర్కొన్నాయి .
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







