రియో 2016లో పాల్గొననున్న బహ్రెయిన్‌

- July 25, 2016 , by Maagulf
రియో 2016లో పాల్గొననున్న బహ్రెయిన్‌

రియో 2016 ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 40 మంది సభ్యులుగుల బహ్రెయినీ డెలిగేషన్‌ సిద్ధమయ్యింది. ఆగస్ట్‌ 5 నుంచి 21 వరకు బ్రెజిల్‌లోని రియో డిజనెరోలో ఒలింపిక్‌ పోటీలు జరగనున్నాయి. షేక్‌ నాజర్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా ఈ బృందానికి నాయకత్వం వహిస్తారు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న బహ్రెయిన్‌, సిల్వర్‌ మెడల్‌ని సొంతం చేసుకోగలిగింది. 1500 మీటర్ల జాగింగ్‌ కాంటెస్ట్‌లో బహ్రెయినీ స్ప్రింటర్‌ మరియమ్‌ జమాల్‌ ఈ ఘనత సాధించారు. బహ్రెయినీ స్పోర్ట్స్‌ డెలిగేషన్‌ ఈసారి అథ్లెటిక్స్‌, షూటింగ్‌, స్విమ్మింగ్‌, రెజ్లింగ్‌ పోటీల్లో పాల్గొననుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com