బహ్రెయిన్ లో ఘనంగా మహిళా దినోత్సవం..!!

- December 02, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో ఘనంగా మహిళా దినోత్సవం..!!

మనామా: బహ్రెయిన్ లో మహిళా దినోత్సవాన్ని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ఘనంగా నిర్వహించింది. LMRA CEO నెబ్రాస్ మొహమ్మద్ తలేబ్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని స్థాయిలలో బహ్రెయిన్ మహిళల సహకారం ఒక విశిష్టమైన ముద్ర వేస్తుందని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి ప్రయాణంలో మహిళల సామర్థ్యం, నాయకత్వ పాత్రను హైలైట్ చేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న బహ్రెయిన్ లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

 రాజు భార్య మరియు సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ అధ్యక్షురాలు సబీకా బింట్ ఇబ్రహీం అల్ ఖలీఫా అధ్యక్షతన, సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ ప్రముఖ పాత్రను కొనియాడారు. కుటుంబ జీవితానికి సహయపడేలా కార్యాలయంలో మహిళలకు వెసులుబాటు ఉండేలా చర్యలు చేపట్టాలని, ఈ సందర్భంగా నెబ్రాస్ మొహమ్మద్ తలేబ్ సూచించారు.

బహ్రెయిన్ మహిళా దినోత్సవం వివిధ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను LMRA డిప్యూటీ CEO నౌరా ఇసా ముబారక్ వెల్లడించారు. మొత్తం లేబర్ ఫోర్సులో మహిళలు 52% ఉన్నారని, అలాగే పర్యవేక్షక మరియు నాయకత్వ స్థానాల్లో మహిళలు 49% ఉన్నారని, ఇది బహ్రెయిన్ మహిళల సామర్థ్యాలను తెలియజేస్తుందని పేర్కొన్నారు. 

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com