సౌదీ అరేబియా–రష్యా మధ్య వీసా మినహాయింపు..!!
- December 02, 2025
రియాద్: సౌదీ అరేబియా మరియు రష్యా లు పరస్పర వీసా మినహాయింపు ఒప్పందంపై సంతకం చేశాయి. రియాద్‌లో జరిగిన సౌదీ-రష్యన్ పెట్టుబడి మరియు వ్యాపార వేదిక సందర్భంగా ఈ సంతకాల కార్యక్రమం జరిగింది.సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరియు రష్యన్ ఫెడరేషన్ ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఒకే క్యాలెండర్ సంవత్సరంలో వరుసగా లేదా వేర్వేరు సందర్శనలలో 90 రోజుల వరకు రెసిడెన్సీ సదుపాయాలను ఈ ఒప్పందం అనుమతిస్తుంది. ఈ ఒప్పందం రెండు దేశాల పౌరులకు సందర్శనలను పెంచడానికి మరియు పర్యాటకం, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అధికారులు తెలిపారు. అయితే, వర్క్, రీసెర్చ్, రెసిడెన్సీ లేదా హజ్ కోసం వచ్చే వారికి ఈ ఒప్పందం వర్తించదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్‌లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్‌లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్‌మూన్..!!







