తులసితో కిడ్నీలో రాళ్లు మాయం
- July 18, 2015
మన పెరట్లో సులువుగా పెరిగే తులసితో ఎంత ఆరోగ్యమో మనందరికీ తెలుసు. తులసి గాలిని పీల్చడం వల్ల గాలి ద్వారా వచ్చే అనేక రోగాలు తొలగిపోతాయి. ప్రతిరోజూ తులసి ఆకుల రసం తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు దూరం అవుతాయని శాస్త్రవేత్త అధ్యయనంలో వెల్లడైంది. పది తులసి ఆకులను మరుగుతున్న నీటిలో వేసి కొంచెం సేపు మూత పెట్టాలి. తరువాత ఆ నీటిని ప్రతిరోజూ తీసుకుంటే క్రమక్రమంగా కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. జలుబు, జ్వరం గొంతు నొప్పి లాంటివి ఉంటే తులసి ఆకులను గోరు వెచ్చని నీటిలో వేసుకుని తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. తులసిని తరచూ తీసుకోవడం వల్ల దంత సమస్యలు రాకుండా ఉంటాయి. తులసి ఆకుల పొడిలో కొద్దిగా ఆవ నూనె చేర్చి దానితో పళ్లు తోముకోవడం వల్ల చిగుళ్ల వాపు, రక్తం కారడంలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. తులసిలోని యాంటి బాక్టీరియల్, యాంటీ బయోటిక్ గుణాలు మన శరీరానికి సంబంధించిన అనేక రోగాలకు మంచి మందుగా పని చేస్తాయి. ఏవైనా పురుగులు కుట్టడం, వాటి వల్ల వచ్చే పుండ్లు మానడానికి కూడా తులసి రసం మంచి ఔషధంగా పని చేస్తుంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







