'శ్రీమంతుడు' ఆడియో విడుదల

- July 18, 2015 , by Maagulf
'శ్రీమంతుడు' ఆడియో విడుదల

మహేష్ బాబు హీరోగా నటించిన 'శ్రీమంతుడు' పాటల విడుదల వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా విడుదల చేసిన ట్రైలర్ లోని డైలాగు ఇది. ఆ ట్రైలర్ మీరూ చూసి ఎంజాయ్ చేయండి. మరో ప్రక్క శృతిహాసన్ క్యారక్టర్ కూడా ఆసక్తిగా ఉంది. చాలా ఇచ్చిన ఊరుకి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయకపోతే లావెక్కిపోతాం అని ఫీలయ్యే క్యారక్టర్. ఇలాంటి అమ్మాయి నుంచి నేర్చుకున్న ఆ ఫిలాసపీతో శ్రీమంతుడు ఏం చేసాడనేది ఈ చిత్రం కథ. ఎప్పుడు చూసినా ఇదే పనిర్రా...బోర్ కొట్టదా అంటూ మహేష్ చేత అదిరిపోయే డైలాగులు చెప్పించాడు కొరటాల శివ. ఎప్పటిలాగే మహేష్ చిత్రానికి అద్బుతమైన టెక్నీషియన్స్ పనిచేసారు. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ విషయంలో గట్టి పోటీ నెలకొందట. ఫైనల్‌గా 'శ్రీమంతుడు' శాటిలైట్ రైట్స్‌ని సుమారు 10 కోట్ల రూపాయలకి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఎడిటింగ్ మరియు డబ్బింగ్ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. ఈ సినిమాలోని నటీ నటుల డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. వారిది ముగియగానే మహేష్ బాబు తన పార్ట్ కి సంబందించిన డబ్బింగ్ ని పూర్తి చేస్తారు. మరో ప్రక్క ఈ చిత్రంలో మహేష్ వాడే సైకిల్ ఖరీదు ఎంత ఉండవచ్చు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమచారం ప్రకారం ఈ సైకిల్ ఖరీదు... మూడున్నర లక్షలు అని తెలుస్తోంది. ఈ సైకిల్... Canondale కంపెనీవారి Scalpel 29 మోడల్ లో త్రీ ఫ్రేమ్ కార్బన్ అని తెలుస్తోంది. ఇది విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నది. ఈ సైకిల్ ఖరీదు... అక్కడ 5500$ అంటున్నారు. మహేష్ ఓ మిలియనీర్ అని ఈ సైకిల్ తో దర్శకుడు చెప్పాడంటున్నారు. ఇక ఈ చిత్రంతో మహేష్‌బాబు నిర్మాతగా మారారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' సినిమాతోనే మహేష్‌ చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు. 'శ్రీమంతుడు' చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి... ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ ఇంతకు ముందు ప్రభాస్ కు 'మిర్చి'తో అదిరిపోయే విజయాన్ని అందించాడు... ఆ దిశగా ఆలోచిస్తే- మహేశ్ బాబుకు అంతకంటే మిన్నయైన విజయాన్ని కొరటాల శివ అందిస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మైత్రీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న 'శ్రీమంతుడు' చిత్రం సకుటుంబ సపరివార సమేతంగా చూడతగ్గ చిత్రమని యూనిట్ సభ్యులు చెబుతున్నారు... దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com