కామారెడ్డి బాలల సంబరాల్లో పాల్గొన్న NATS
- December 04, 2025
కామారెడ్డి: డిసెంబర్:2 అక్షరం ఒక్కటే జీవితాలను మార్చుతుందని బలంగా నమ్మిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్..పేద విద్యార్ధులకు సాయం అందించడంలో వారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుందని మరోసారి నిరూపించింది.తాజాగా కామారెడ్డిలో నాట్స్ బాలల సంబరాలు నిర్వహించింది.ఈ సంబరాల సందర్భంగా క్రీడా, సాంస్కృతిక పోటీల్లో ఉత్తమంగా రాణించిన వారికి నాట్స్ బహుమతులు పంపిణీ చేసింది. పేద విద్యార్థులను ప్రోత్సహించడానికి నాట్స్ తన వంతు కృషి చేస్తుందని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చే తెలుగు విద్యార్థుల ఎంట్రన్స్ ఎగ్జామ్స్, వీసా ప్రక్రియలు, మరెన్నో అంశాలపై నాట్స్ అవగాహన కల్పిస్తుందని అన్నారు. కామారెడ్డిలో ఎన్నారై శ్యాం సుందర్ రెడ్డి బాలల సంబరాలు నిర్వహించడం సంతోషంగా ఉందని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి అన్నారు. అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా నాట్స్ అండగా నిలబడుతుందని తెలిపారు. నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ కార్య నిర్వహక సభ్యులు కిరణ్ మందాడి స్థానిక ఉపాధ్యాయులు, ప్రముఖులు పాల్గొన్నారు. విశ్రాంత ఉద్యోగ సంఘాలకు కావాల్సిన క్రీడా పరికరాలను కూడా నాట్స్ ఉచితంగా అందించింది.
తాజా వార్తలు
- భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!
- మస్కట్‌లో అంతర్జాతీయ కార్డియాక్ సర్జరీపై వర్క్‌షాప్..!!
- కువైట్‌లో KD 15,000 విలువైన గొర్రెలు చోరీ..!!
- బహ్రెయిన్ పార్లమెంట్లో ఆహార భద్రతపై చర్చ..!!
- ఖతార్‌లో ‘కాక్టస్ పిల్స్’లో హానికర రసాయన ఆనవాళ్లు..!!
- దుబాయ్‌లో తగ్గుతున్న రెంట్స్..ఇళ్లు మారుతున్న టెనేంట్స్..!!
- వికసిత్ భారత్'కు యువతే భవిష్యత్తు సంరక్షకులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు
- రియాద్ పై హౌతీల దాడిని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు







