రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్‌ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు

- November 24, 2026 , by Maagulf
రియాద్ ఆర్థిక జిల్లాలోని టవర్‌ పై హౌతీ దాడి..11 మందికి గాయాలు

రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఆర్థిక జిల్లాలో ఉన్న ఓ టవర్‌ పై హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన ఉగ్రదాడిలో 11 మంది గాయపడ్డారు. మంగళవారం జరిగిన ఈ ఘటనను సౌదీ అరేబియా పౌర రక్షణ విభాగం ధృవీకరించింది.

గాయపడిన వారిలో ఇద్దరు సౌదీ పౌరులు, ఇద్దరు భారతీయులు, ముగ్గురు నేపాల్‌కు చెందినవారు, నలుగురు ఈజిప్టు దేశస్థులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

దాడి జరిగిన వెంటనే సంబంధిత భద్రతా, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని పౌర రక్షణ విభాగం తెలిపింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పాటు ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు అవసరమైన అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.

అంతకుముందు యెమెన్‌లో చట్టబద్ధత పునరుద్ధరణ కోసం పనిచేస్తున్న సంకీర్ణ దళాల అధికార ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కీ అల్ మాలికి రియాద్ ఆర్థిక జిల్లాలోని ఓ టవర్ లక్ష్యంగా దాడి జరిగినట్లు వెల్లడించారు. ఘటనపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఈ ఘటనలో భారతీయులు కూడా గాయపడటంతో సౌదీ అరేబియాలోని భారతీయ ప్రవాసుల్లో ఆందోళన నెలకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com