ఖతార్ వర్క్‌ఫోర్స్ కోసం ఖతార్, ILO ఒప్పందం..!!

- December 04, 2025 , by Maagulf
ఖతార్ వర్క్‌ఫోర్స్ కోసం ఖతార్, ILO ఒప్పందం..!!

దోహా: ఖతార్ వర్క్ ఫోర్స్ భవిష్యత్తు అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడానికి ఖతార్ ఫౌండేషన్ మరియు అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO మధ్య ఒప్పందం కుదిరింది. గత 25 సంవత్సరాలుగా ఖతార్ ఫౌండేషన్ పూర్వ విద్యార్థుల ఇంపాక్ట్ స్టడీ డేటా మరియు ఇతర కార్మిక మార్కెట్ సంబంధిత అధ్యయనాలను వర్క్ ఫోర్స్ ను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.ఐదు కీలక రంగాలలో పూర్వ విద్యార్థులు మరియు యజమానుల మధ్య నైపుణ్య అంతరాలను, అసమతుల్యతలను తగ్గిస్తారు. ఇటీవల దోహాలో జరిగిన WISE 12 సమ్మిట్ సందర్భంగా QF మరియు ILO మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఖతార్ నేషనల్ విజన్ 2030 ఆశయాలకు మరియు ఖతార్ మూడవ జాతీయ అభివృద్ధి వ్యూహ లక్ష్యాలకు ప్రత్యక్షంగా మద్దతు ఇస్తాయని అన్నారు. ఈ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి మరియు ఖతార్ యొక్క దీర్ఘకాలిక మానవ మూలధన అభివృద్ధికి దోహదపడటానికి తాము ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com