కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

- December 04, 2025 , by Maagulf
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..

న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 87 నకిలీ, అనధికారిక లోన్ యాప్స్ పై బ్యాన్ విధించింది కేంద్రం. అనధికారిక లోన్ యాప్స్ పై బ్యాన్ విధించినట్లు లోక్ సభలో ప్రకటించింది. సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు అని వినియోగదారుల ఫిర్యాదులతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటుగా పౌరుల భద్రత, ఆర్థిక రక్షణ కోసం మరిన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కేంద్రం స్పష్టం చేసింది.

భారత ప్రభుత్వం 87 ఇల్లీగల్ లోన్ యాప్స్ బ్లాక్ చేసినట్లు ధృవీకరించింది. ఈ ఆదేశాన్ని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) జారీ చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 69Aలో పేర్కొన్న చట్టబద్ధమైన అధికారాల ప్రకారం నిషేధం విధించింది.

ఈ చర్యను కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్‌సభలో అధికారికంగా తెలిపారు. అనధికారిక, తరచుగా దోపిడీ చేసే డిజిటల్ లెండర్స్ (రుణదాతలు) కార్యకలాపాలపై పెరుగుతున్న ప్రజల ఆందోళనను ఈ చర్య పరిష్కరిస్తుంది. ఆర్బీఐ నిర్దేశించిన గైడ్ లైన్స్ ను ఈ ప్లాట్‌ఫామ్‌లు తరచుగా ఉల్లంఘిస్తున్నాయి. అంతేకాదు ఇవి బలవంతపు లోన్ రికవరీ పద్ధతులకు ప్రసిద్ధి పొందాయి.

ఈ లోన్ యాప్స్ వేధింపులకు పాల్పడుతున్నాయి. అధిక వడ్డీలు వసూలు చేస్తున్నాయి. అంతేకాదు వినియోగదారుల వ్యక్తిగత డేటాను చట్టవిరుద్ధంగా యాక్సెస్ చేయడం, డేటాను దుర్వినియోగం చేయడం వంటివి చేస్తున్నాయని కేంద్రం గుర్తించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com