భారత్‌కు పుతిన్.. స్వాగతం పలికిన ప్రధాని మోదీ
- December 04, 2025
న్యూ ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్‌కు ఘన స్వాగతం పలికారు. పుతిన్ రెండు రోజుల పాటు మన దేశంలో పర్యటించనున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత్-రష్యా వార్షికోత్సవ సదస్సులో ఇరుదేశాల అధినేతలు పాల్గొననున్న సంగతి తెలిసిందే.
ఈ సదస్సులో పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. వాణిజ్యం, ఆర్థికం, ఆరోగ్యం, అకాడమిక్స్, సంప్రదాయం, మీడియా రంగాలకు సంబంధించి పలు ఒప్పందాలపై ఇరుదేశాధినేతలు సంతకాలు చేయనున్నట్లు సమాచారం. అలాగే రక్షణ రంగంలో కూడా కీలక ఒప్పందాలు జరగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ కూడా పుతిన్ ను రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక స్వాగతం పలకనున్నారు.
చివరిసారిగా పుతిన్ 2021లో భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దీంతో నాలుగేళ్ల తర్వాత ఆయన మరోసారి భారత్‌లో అడుగుపెట్టారు. ఇరుదేశాధినేతలు ఎలాంటి అంశాలపై ఒప్పందం కుదుర్చుకోనున్నారనేదానిపై ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







