ఆఫీస్ తరువాత ఫోన్ కాల్స్, మెయిల్స్‌ను ఉద్యోగులు పట్టించుకోకండి..
- December 06, 2025
న్యూ ఢిల్లీ: ఉద్యోగులకు గుడ్ న్యూస్. కీలక బిల్లు లోక్ సభ ముందుకు వచ్చింది. రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు -2025ను శుక్రవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు–2025 ప్రకారం.. విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్న ఉద్యోగులకు కార్యాలయ పనుల నిమిత్తం ఫోన్ చేసి, మెయిల్స్ పంపి వారి విశ్రాంతికి భంగం కలిగించకుండా నిరోధించేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
విధులు ముగిశాక, సెలవు రోజుల్లో కూడా ఉద్యోగులకు వారి కార్యాలయాల నుంచి ఫోన్లు, మెయిల్స్ రావడం వల్ల వ్యక్తిగత, కుటుంబ జీవనానికి ఆటంకం కలుగుతోందని బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా సుప్రియా సూలే పేర్కొన్నారు. అటువంటి కాల్స్, మెయిల్స్‌ను స్వీకరించకుండా తిరస్కరించే హక్కు ఉద్యోగులకు కల్పించాలని బిల్లు పేర్కొంది. దీనికి గాను ఉద్యోగుల సంక్షేమ సంఘంను నెలకొల్పాలని బిల్లు ప్రతిపాదించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కిడ్నీ రోగులకు ఊరట ..!!
- లేబర్ ఫోర్సులో కువైటీలు 11శాతం..!!
- సుల్తాన్ ఖబూస్ యూనివర్సిటీలో స్నాతకోత్సవం సందడి..!!
- ఇజ్రాయెల్ ప్రకటనపై 8 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఆందోళన..!!
- డ్రగ్స్ తో తడిసిన పేపర్ పార్సిల్..మహిళకు జైలుశిక్ష..!!
- సౌదీలో 18శాతం పెరిగిన దేశీయ పర్యాటక వ్యయం..!!
- హైదరాబాద్‌లో అల్లూ సినిమాస్ కొత్త డాల్బీ థియేటర్
- ఆఫీస్ తరువాత ఫోన్ కాల్స్, మెయిల్స్‌ను ఉద్యోగులు పట్టించుకోకండి..
- జమిలి ఎన్నికల పై కొనసాగుతున్న చర్చలు
- ఏపీ: ఈరోజు మెగా జాబ్ మేళా







