డ్రగ్స్ తో తడిసిన పేపర్ పార్సిల్..మహిళకు జైలుశిక్ష..!!
- December 06, 2025
దుబాయ్: డ్రగ్స్ కేసులో మధ్య ఆసియాకు చెందిన ఒక మహిళకు దుబాయ్ కోర్టు జైలుశిక్ష విధించింది. తన స్నేహితురాలి పాస్‌పోర్ట్ కాపీని ఉపయోగించి మాదకద్రవ్యాలతో తడిసిన కాగితాలను కలిగి ఉన్నట్లు తేలిన పార్శిల్‌ను సేకరించినందుకు దుబాయ్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఆమెను దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించింది. దుబాయ్ క్రిమినల్ కోర్టు తన స్నేహితురాలిని నిర్దోషిగా ప్రకటించింది. ఆమె నేరంలో పాల్గొనలేదని తీర్పు చెప్పింది.
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో యూరోపియన్ దేశం నుండి వస్తున్న పార్శిల్‌పై కస్టమ్స్ ఇన్స్పెక్టర్ అనుమానం రావడంతో తనిఖీ చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. ప్యాకేజీలో మాదకద్రవ్యాలతో నిండిన షీట్లు ఉన్నాయని మాన్యువల్ తనిఖీలో వెల్లడైంది. వాటిని తీసుకోబోయే మహిళను అరెస్టు చేసేందుకు అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు.
నిందితురాలు పార్శిల్‌ను తీసుకోవడానికి షిప్పింగ్ కంపెనీ కార్యాలయానికి వచ్చింది. ఆమె తన సొంత గుర్తింపు అని పేర్కొంటూ తన స్నేహితురాలి పాస్‌పోర్ట్ ఫ్రింట్ కాపీని సమర్పించింది. కస్టమ్స్ బృందం మరియు పోలీసు అధికారులు ఆమెను అక్కడికక్కడే అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. తనిఖీలో ఆమె మరొక మహిళ పాస్‌పోర్ట్ కాపీని ఉపయోగిస్తున్నట్లు వెల్లడైంది. ఆమెను వెంటనే విచారణ కోసం పిలిపించారు. పాస్‌పోర్ట్ ఒరిజినల్ హోల్డర్ డ్రగ్ రవాణా లేదా సంఘటన గురించి తనకు తెలియదని వెల్లడించింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







