ఇజ్రాయెల్ ప్రకటనపై 8 అరబ్ ఇస్లామిక్ దేశాలు ఆందోళన..!!
- December 06, 2025
దోహా: గాజా నివాసితులు ఈజిప్టులోకి ప్రవేశించడానికి వీలుగా రఫా క్రాసింగ్‌ను ఒక దిశలో మాత్రమే తెరవాలని ఇజ్రాయెల్ ప్రకటించడంపై ఎనిమిది అరబ్ ఇస్లామిక్ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్ ప్రకటనను ఖండించిన దేశాల్లో ఖతార్, ఈజిప్ట్, హాషెమైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా, పాకిస్తాన్, టర్కి, సౌదీ అరేబియా ఉన్నాయి. ఆయా దేశాల విదేశాంగ మంత్రులు పేరిట ఈ మేరకు ప్రకటన విడుదలైంది.
పాలస్తీనా ప్రజలను వారి భూమి నుండి తరిమివేసే ప్రయత్నాలను పూర్తిగా తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికకు పూర్తిగా కట్టుబడి ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. రెండు దిశలలో రఫా క్రాసింగ్‌ను తెరవాలని డిమాండ్ చేశారు. స్థానికులు స్వేచ్ఛగా ప్రయాణించే హక్కు కల్పించాలని సూచించారు.
అదే సమయంలో మానవతా సాయాన్ని అన్ని ప్రాంతాలకు అనుమతించాలని, వారి మాతృభూమిని నిర్మించుకోవడంలో వారికి తగిన పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి కాల్పుల విరమణను పూర్తిస్థాయిలో అమలు చేయాలని సూచించారు. పాలస్తీనా అథారిటీ గాజా స్ట్రిప్‌లో తన బాధ్యతలను తిరిగి చేపట్టడానికి అనుమతించాలన్నారు.
UN భద్రతా మండలి తీర్మానం 2803 ద్వారా టూస్టేట్ పరిష్కారానికి అనుగుణంగా న్యాయమైన సహాయాన్ని అందించేందుకు ముందుంటామని వెల్లడించాయి. జూన్ 4, 1967 సరిహద్దులలో తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న గాజా మరియు వెస్ట్ బ్యాంక్ ఆక్రమిత భూభాగాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







