ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- December 08, 2025
మస్కట్: ఒమన్ - ఇండియా మధ్య జరిగిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై షురా కౌన్సిల్ ఆర్థిక కమిటీ చర్చించింది. కౌన్సిల్ చైర్మన్ ఖలీద్ అల్ మావాలి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడుల ప్రమోషన్ శాఖ మంత్రి ఖైస్ అల్ యూసఫ్ తోపాటు పలువురు ఆర్థిక రంగ నిపుణులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఒప్పందంలోని కీలక ఆర్థిక మరియు పెట్టుబడి క్లాజులపై విస్తృతమైన చర్చలు జరిగాయి. ప్రతిపాదిత ఒప్పందంపై మంత్రిత్వ శాఖ తరఫున మంత్రి కమిటీ సభ్యులకు బ్రీఫింగ్ ఇచ్చారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచడానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క పోటీతత్వాన్ని పెంచడానికి, ఉత్పాదక రంగాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడానికి , వివిధ రంగాలలో పెట్టుబడులను ప్రారంభించడానికి భారత్ తో కుదిరిన ఒప్పందం అందించే అవకాశాలను వివరించారు. అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించిన ఆర్థిక కమిటీ భారత్ తో ఒప్పందాన్ని ఆమోదించిందని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







