ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- December 08, 2025
మనామా: న్యూఢిల్లీలోని తాజ్ మహల్ హోటల్‌లో జరిగిన 4వ IBA ఇండియా లిటిగేషన్ మరియు ADR సింపోజియంలో బహ్రెయిన్ అంతర్జాతీయ వివాద పరిష్కార మండలి సెక్రటరీ జనరల్ ప్రొఫెసర్ మారికే పట్రాని పాల్సన్ పాల్గొన్నారు. "ప్రైవసీ, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (GDPR), ఇండియాస్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్" అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, సోషల్ మీడియా నియంత్రణ తదితర అంశాలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. వ్యక్తిగత ప్రైవసీ, డేటా రక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సింపోజియంలో ప్రముఖ సీనియర్ న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు మరియు సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. డిజిటల్ చట్టం మరియు మానవ హక్కులలో ప్రస్తుత పరిణామాలను ప్రస్తావించే ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ ను నిర్వహించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సంక్లిష్ట వివాదాలను పరిష్కరించడానికి అమల్లో ఉన్న చట్టాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నాలను ఈ సదర్భంగా సమీక్షించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!







