అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- December 10, 2025
కువైట్: అల్-రాయ్ ప్రాంతంలోని నిర్మాణ స్థలంలో జరిగిన ల్యాండ్ స్లైడ్ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించినట్లు జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రకటించింది. గంటల తరబడి తీవ్ర ప్రయత్నాల తర్వాత ఇసుక కింద చిక్కుకున్న రెండవ కార్మికుడిని బయటకు తీయడంలో రెస్క్యూ బృందాలు విజయం సాధించాయని అగ్నిమాపక దళంలోని పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ అల్-గారిబ్ ధృవీకరించారు. కానీ, అప్పటికే అతను మరణించాడని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి అగ్నిమాపక బృందాలు, సంబంధిత ఏజెన్సీలతో పాటు, సైట్ కూలిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అల్-గారిబ్ తెలిపారు.
అల్-రాయ్ పారిశ్రామిక ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో ఒక్కసారిగా ల్యాండ్ స్లైడ్ ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. తొలుత ఒక కార్మికుడు మరణించగా, మరొక కార్మికుడు చిక్కుకుపోయాడు. అన్ని శిధిలాలను తొలగించి, సైట్ పూర్తిగా సురక్షితంగా ఉండే వరకు జనరల్ ఫైర్ ఫోర్స్ ఫీల్డ్ ఆపరేషన్లను కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు.
తాజా వార్తలు
- దోహా ఫోరం 2025: QR2.016 బిలియన్ల విలువైన ఒప్పందాలు..!!
- అల్-రాయ్లో ఇద్దరు కార్మికులు మృతి..!!
- యునెస్కో జాబితాలో ఒమన్ 'బిష్ట్' రిజిస్టర్..!!
- బహ్రెయిన్ లో నేషనల్ డే ,యాక్సెషన్ డే సెలవులు అనౌన్స్..!!
- అల్ రీమ్ ద్వీపంలోని భవనంలో అగ్నిప్రమాదం..!!
- సౌదీ అరేబియాలో చల్లబడ్డ వాతావరణం..!!
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!







