విజయ్‌కాంత్ దంపతులపై అరెస్టువారెంట్ జారీచేసిన తిరుపూర్ ప్రిన్సిపల్ న్యాయస్థానం
- July 26, 2016
తమిళనాడులో డీఎండీకే అధినేత, సినీనటుడు విజయ్‌కాంత్ దంపతులపై తిరుపూర్ ప్రిన్సిపల్ న్యాయస్థానం అరెస్టువారెంట్ జారీచేసింది. పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరుకానందుకు విజయ్‌కాంత్, ఆయన సతీమణి ప్రేమలతకు న్యాయమూర్తి అలమేలు నటరాజన్ వారెంట్ జారీ చేశారు. గత మూడు విచారణలకు హాజరుకాని విజయ్‌కాంత్ మంగళవారం కూడా హాజరుకాకపోవడంతో కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 2015 నవంబర్ 6న పల్లడంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ముఖ్యమంత్రి జయలలితపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పబ్లిక్‌ప్రాసిక్యూటర్ కేఎన్ సుబ్రహ్మణియం విజయ్‌కాంత్ దంపతులపై ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







