సెంట్రల్ బ్యాంకుల స్వాతంత్రాన్ని ప్రభుత్వాలే పరిరక్షించాలి - రఘురామ్ రాజన్
- July 26, 2016
సెంట్రల్ బ్యాంకుల స్వాతంత్రాన్ని కచ్చితంగా ప్రభుత్వాలే పరిరక్షించాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు సాధించడానికి ప్రభుత్వాలు ఈ చర్యలు తీసుకోవాలన్నారు. స్థిరమైన ఆర్థిక వృద్ధి రేటు పెంపు నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు ఎలాంటి సాక్ష్యాలు లేని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తున్నాయని రాజన్ ఆందోళన వ్యక్తంచేశారు. బ్రెగ్జిట్ పరిణామ క్రమంలో బ్యాంకు ఆఫ్ ఇంగ్లాండ్ ఎదుర్కొన్న దాడులు, పెరిఫీరియల్ ఆర్థికవ్యవస్థను స్థిరీకరించే సమయంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, ఇంటరెస్ట్-రేట్ గైడ్ లైన్స్ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వు ఎదుర్కొన్న అటాక్స్ ను ఆయన గుర్తుచేశారు.
ఆయా సెంట్రల్ బ్యాంకులు తమ భూభాగ పరిధిలోనే ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్నాయని ముంబైలోని ప్రెస్ స్టేట్ మెంట్ లో రాజన్ వ్యాఖ్యానించారు. సాక్ష్యాలు లేని ఇలాంటి నిందారోపణలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలు దృష్టిసారించాలని, సెంట్రల్ బ్యాంకుల స్వేచ్ఛను కాపాడాలని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలను వృద్ధి బాటలో నడిపించడానికి సెంట్రల్ బ్యాంకులు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటాయని.. సెంట్రల్ బ్యాంకులపై ఎలాంటి ఆధారాలు లేని విమర్శలు చేయడం చాలా బాధాకరమన్నారు. కాగ, భారత సెంట్రల్ బ్యాంకు గవర్నర్ గా రాజన్ రెండోసారి కొనసాగింపుపై, బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యం స్వామి నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ గవర్నర్ గా ఆయన పదవీ కాలం ఈ సెప్టెంబర్ లో ముగియనున్న నేపథ్యంలో ఈ కామెంట్లు చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







