ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్

- December 11, 2025 , by Maagulf
ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్

అమరావతి: దేశ చరిత్రలోనే ఉర్దూ భాషాభివృద్ధి కొరకు పాటుపడిన ఏకైక నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని మైనార్టీ శాఖా మంత్రి ఫరూఖ్ ఉద్ఘాటించారు. బుధవారం విజయవాడ షా జాహుర్ ముసాఫిర్ ఖానాలో ఉర్దూ అకాడమీ ఉద్యోగుల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. సమావేశానికి ఉర్దూ అకాడమీ చైర్మన్ మహ్మద్ ఫరూక్ శుబ్లీ అధ్యక్షత వహించారు. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భాషకు మతంతో సంబందం లేదన్నారు. ఉర్దూ అకాడమీ చరిత్రలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉర్దూ భాషాభివృద్ధికి నూతన అధ్యాయం లిఖిస్తాము.

అకాడమీ(AP) ఉద్యోగుల్లో పనిచేసిన వారికి గుర్తింపు, చెయ్యని వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఫరూక్ శుబ్లీ స్పష్టం చేశారు. చైర్మన్ మాట్లాడుతూ ఉద్యోగులంతా నా కుటుంబ సభ్యులు, మీ కష్టాలను మా కష్టాలు అని అనుకునే విధంగా శక్తివంచన లేకుండా పని చేయండన్నారు. సీఎం చేతుల మీదుగా బ్రోచర్ విడుదల చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు నిర ్వహిస్తామని అలాగే అధిక ప్రాధాన్యత రాయలసీమ ప్రాంతానికి ఇస్తామన్నారు.159 మంది ఉద్యోగుల్లో 14మంది గైర్హాజరైన వారికి తక్షణమే మెమో జారీ చేయాలని అకాడమి సెక్రటరీ ని అదేశించారు. వారోత్స వాలను సురూర్ ఏ ఉర్దూ మహోత్సవ్ పేరుతో ఈనెల 16 నుంచి 20వ తేది వరకు నిర్వహిస్తామన్నారు. మీరు ఉర్దూ అకాడమీ ఉద్యోగులు కాదు కల్చరల అంబాసిడర్ అనగా (సాంస్కృతిక రాయబారి) అని చైర్మన్ ఫరూఖ్ స్పష్టంచేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com