ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్

- December 11, 2025 , by Maagulf
ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్

అమరావతి: ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ చేపట్టిన ఉద్యమం వేగం అందుకుంది. ఈ నేపథ్యంలో పార్టీ సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌కు సమర్పించేందుకు వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ముందుగా డిసెంబర్ 17న భేటీ కావాల్సి ఉన్నా, కొన్ని షెడ్యూల్ కారణాల వల్ల ఈ సమావేశం డిసెంబర్ 18కు మార్చబడింది.

వైసీపీ ఆరోపణల ప్రకారం, కూటమి ప్రభుత్వం పీపీపీ మోడల్ పేరుతో మెడికల్ కళాశాలలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించే ప్రయత్నం చేస్తోందని, ఇది ప్రజలపై భారం పెంచుతుందని పార్టీ పేర్కొంటోంది. దీనికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా సభలు, ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ “కోటి సంతకాల సేకరణ”ను చేపట్టింది.

డిసెంబర్ 18న సాయంత్రం 4 గంటలకు వైఎస్ జగన్, పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల అభిప్రాయాన్ని, సేకరించిన సంతకాల పత్రాలను గవర్నర్‌కు అందజేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com