కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- December 11, 2025
నూజివీడు: రూ.1.54 కోట్లతో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు.నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం ముసునూరు గ్రామంలో సి.సి.రోడ్లు, యాదవులు కమ్యూనిటీ, హాల్, మరియు గుల్లపూడి గ్రామంలో సి.సి.రోడ్లు, శంకుస్థాపన చేసి విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి. సుమారు.43 లక్షలతో సి.సి.రోడ్లు శంకుస్థాపన మరియు యాదవులు కమ్యూనిటీ హాల్ రూ.20 లక్షల తో శంకుస్థాపన గుళ్లపాడు గ్రామములో జల్జీవన్ మిషన్ రూ.59 లక్షల సుమారు,,రూ.32లక్షల.సి.సి.రోడ్లు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శ్రీకారం చుట్టారు.
గ్రామంలో అనంతరం ప్రజల తో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఏడాదిన్నర పాలనలోనే ఎన్నో విజయాలు సాధించామని, రానున్న రోజులు అన్ని మంచి రోజులేనని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు ప్రజలు మనోభావాలు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించటమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం లో రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండు బ్యాలెన్సు గా ముందుకు సాగుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా పెద్దమొత్తంలో పెన్షన్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించి కేవలం రూ 15 లకే మూడు పూటలూ కడుపునిండా భోజనం పెట్టి నిరుపేదలు ఆకలి తీర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
తల్లికి వందనం అమలు చేసి, కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి రూ 15వేల రూపాయలు చొప్పున అందిస్తున్నామని అన్నారు. డిఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయుల పోస్టులను నియమించామని అన్నారు. అన్నదాత సుఖీభవ రూ.20 వేలు, రైతన్నా మీకోసం ద్వారా రైతులకు వ్యవసాయ సాగులో మెలుకవలు తెలియజేయడం. పింఛన్లు రూ.4 వేలు పెంపు. మహిళలకు ఉచిత బస్సు వికలాంగులకు రూ.6 వేలు, బెడ్ రెస్ట్ పేసేంట్లకు రూ.15వేలు, డయాలసిస్ పేసెంట్లకు రూ.10 వేలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం అన్నారు. బహుళ జాతి సంస్థల రాకతో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా సుమారు నిరుద్యోగ యువతకు సుమారు. 7 లక్షల ఉద్యోగ కల్పన దేశంలోనే నెంబర్ 1 నిలిసిన కూటమి ప్రభుత్వం అన్నారు. 3లక్షల ఇళ్ల నిర్మాణం. ఉచిత దీపం పథకం.
తాజా వార్తలు
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే
- ఫిబ్రవరి 11న సెలవు ఇవ్వాలని SEC ఆదేశం
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు









