ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!

- December 11, 2025 , by Maagulf
ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!

దోహా: ఖతార్ లో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ (MoM) 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలను ప్రారంభించింది.  ఇది డిజిటల్ యాక్సెసిబిలిటీని మెరుగుపరచడంతోపాటు ప్రజా విధానాలను క్రమబద్ధీకరించడంలో సహయపడుతుందని తెలిపింది.  కొత్త డిజిటల్ వ్యవసాయ సేవలు ఇప్పుడు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని ప్రకటించారు.  

కొత్తగా ప్రవేశపెట్టిన సేవలు వ్యవసాయ కార్యకలాపాలను కవర్ చేస్తాయని మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందుల దిగుమతి, ఎగుమతి, తయారీ మరియు నిర్వహణకు లైసెన్సింగ్, అలాగే వ్యవసాయ ఉత్పత్తులను నమోదు చేయడం మరియు పునరుద్ధరించడం కోసం సేవలు ఉన్నాయని అన్నారు.   

ఈ డిజిటల్ సేవలు అనేక కీలక ప్రయోజనాలను అందిస్తాయని, ప్రధానంగా వినియోగదారులు ఎప్పుడైనా మరియు ఏ ప్రదేశం నుండి అయినా సేవలను యాక్సెస్ చేయవచ్చని వెల్లడించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com