అయ్యోపాపం ముంగిస
- July 19, 2015
అనగనగా ఒక ఊరిలో ఒక బీద బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ బ్రాహ్మణుడు బీదవాడైనా కానీ వేద శాస్త్రాల్లో పండితుడు. భార్య భర్తననుసరించి ఉన్నంతలో ఇల్లు గడిపే మహా సాధ్వి. ఒకరోజు ఆమె గుమ్మంలో కూర్చోని పని చేసుకుంటుండగా ఎక్కడి నుండో ఒక ముంగిస కాలికి గాయంతో రక్తం కారుతూ గుమ్మం దగ్గరికి వచ్చి పడిపోయింది. ఆ బ్రాహ్మణి దాన్ని చేతిలోకి తీసుకుని దాని గాయానికి కట్టు కట్టి మందు రాసింది. అప్పటి నుండి ఆ ముంగిస ఆ ఇంట్లోనే ఉండిపోయి ఆమెకు తోడుగా ఉండేది. రోజూ ఆమె చేత్తో ఆ ముంగిస తలను ప్రేమతో నిమురుతూ ముద్దులాడేది. దాంతో దానికి ఆమె పట్ల ఆ ఇంటి పట్ల ఎంతో కృతజ్ఞత కలిగింది. కొన్నాళ్లకి బ్రాహ్మణ దంపతులకి ఒక బుజ్జి బాబు పుట్టాడు. ఆ బాబు ఉయ్యాల్లో ఆడుకుంటూంటే ముంగిస ఉయ్యాల పక్కనే కాపలా కాస్తూ ఉండేది. ఒకరోజు ఆ బ్రాహ్మణి కొడుకుని తన భర్తకి అప్పగించి, తాను పొరుగింటికి వెళ్లింది. కొంత సేపయ్యాక ఆ బ్రాహ్మణునితో ఏదో పెళ్లి ముహూర్తం పెట్టించుకోవాలని ఆ ఊరి పెద్ద వచ్చారు. అప్పుడు అతను బాబుని వదిలి గుమ్మం బయట అరుగు మీద పంచాంగం తిరగేస్తూ బాబు సంగతిని మర్చిపోయి ఊరి పెద్దతో మాటాడుతూ ఉండిపోయాడు. ఇంతలో ఎక్కడి నుండో ఒక పాము ఆ ఇంటి చూరిలోంచి ఉయ్యాల చీరను ఆసరాగా చేసుకొని బాబు దగ్గరికి రాసాగింది. అక్కడే ఉన్న ముంగిస అమాంతం దాని మీదకి దూకి అతి కష్టంపై ప్రాణాలకు తెగించి ఆ పాముని చంపేసి, నెత్తురు అంటిన నోటితో అలసిపోయి గుమ్మం దగ్గరగా ఉన్న బ్రాహ్మణుడి వద్దకు రాబోతుండగా, అది చూసిన బ్రాహ్మణుడు ఈ ముంగిస తన బాబుకేదో హాని తలబెట్టిందని పొరపడి అక్కడ ఉన్న కర్రతో దాని తల పగులగొట్టి చంపేశాడు. ఇంతలో లోపలికి వచ్చి చూడగా అక్కడ చచ్చి పడి ఉన్న పామును చూసి జరిగింది గ్రహించి తన భర్త చేసిన పనికి చాలా బాధపడింది. తన తొందరపాటుకు పాపం అన్యాయంగా ముంగిస నా చేతిలో బలైపోయిందే అని మనసులో చాలా బాధపడ్డాడు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







