వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!

- December 13, 2025 , by Maagulf
వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!

మస్కట్: ఒమన్ లో వింటర్ సీజన్ సందర్భంగా విత్యుత్ ప్రమాదాలు పొంచి ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ కాలంలో వాటర్ హీటర్లతోపాటు రూమ్ హాటర్లు వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని తెలిపారు.గత వారం, ఒక పట్టణంలో ఒక యువతి వాటర్ హీటర్ కారణంగా కాలిన గాయాలకు గురైంది. చికిత్స పొందుతు తన ప్రాణాలను కోల్పోయింది.ఈ సంఘటన ప్రతి ఇంటిలో అవగాహన, సురక్షితమైన వినియోగం మరియు క్రమం తప్పకుండా నిర్వహణ అత్యవసర అవసరాన్ని తెలియజేసింది.

సాధారణంగా ఫ్యామిలీస్ వింటర్ లో వాటర్ హీటర్లపై ఎక్కువగా ఆధారపడుతున్నందున, చిన్న నిర్వహణ సమస్యలే తీవ్రమైన భద్రతా ప్రమాదాలుగా మారతాయని అధికారులు హెచ్చరించారు.అందువల్ల ఇంట్లో ప్రతి ఒక్కరికి విద్యుత్ సంబంధిత ప్రమాదాలపై అవగాహన కల్పాంచాలని ఎలక్ట్రికల్ ఇంజనీర్ మొహమ్మద్ అల్ యారుబి సూచించారు.కేబుల్ సామర్థ్యాన్ని నిరంతరం చెక్ చేయాలని, సరైన గ్రౌండింగ్ లేకుండా హీటర్లను ఉపయోగించవద్దని తెలిపారు.వింటర్ సీజన్ ప్రారంభమయ్యే ముందు ట్యాంక్ మరియు పైపుల చుట్టూ థర్మల్ ఇన్సులేషన్‌ ఉండేలా చూసుకోవాలని, తద్వారా ప్రమాదానలు నివారించవచ్చని తెలిపారు.హీటర్లు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని, లేదంటే  విద్యుత్ ను నిలిపివేయాలని కోరారు. 

ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులకు నీటి వేడిని చేతితో చూడాలని,  బాత్రూంలో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని కూడా ఆయన సిఫార్సు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com