ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!

- December 13, 2025 , by Maagulf
ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!

మనామా: బాలీవుడ్ తాజా స్పై సినిమా 'ధురంధర్' బహ్రెయిన్‌లో ప్రదర్శనకు అనుమతి నిరాకరించారు. దీంతోపాటు జీసీసీలోని మరే ఇతర దేశంలోనూ తెరపైకి ఈ  సినిమా రాదని తెలుస్తోంది. రణవీర్ సింగ్ నటించగా, ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ హై-ప్రొఫైల్ యాక్షన్ సినిమాకు యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్ మరియు ఒమన్‌తో సహా అన్ని ప్రధాన గల్ఫ్ దేశాలు విడుదల చేసేందుకు అనుమతి నిరాకరించాయి.

సినిమాలోని రాజకీయపరమైన కంటెంట్ వల్లే గల్ఫ్ దేశాలు అనుమతిని నిరాకరిస్తున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.  అయతే, సరిహద్దు వివాదాలకు సంబంధించిన సినిమాల పట్ల గల్ఫ్ మార్కెట్లు అత్యంత సున్నితంగా వ్యవహరిస్తాయన్న హిస్టరీ ఉంది. గతంలోనూ క్రాస్ బార్డర్ ఇష్యూ నేపథ్యంలో ఫైటర్, టైగర్ 3, మరియు బెల్ బాటమ్ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల విడుదలపై వివిధ గల్ఫ్ దేశాలు నిషేధాన్ని విధించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com