గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!

- December 13, 2025 , by Maagulf
గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!

దోహా: ఆర్టన్ క్యాపిటల్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ పాస్‌పోర్ట్ పవర్ ర్యాంక్ 2025 లో ఖతారీ పాస్‌పోర్ట్ 120 మొబిలిటీ స్కోర్‌తో ప్రపంచవ్యాప్తంగా 44వ ర్యాంక్‌ను సాధించింది. ఖతారీ పాస్‌పోర్ట్ ఉన్న పౌరులే 69 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. అలాగే, 42 దేశాలకు వీసా-ఆన్-అరైవల్ సదుపాయాన్ని పొందవచ్చు.ఖతార్ పాస్‌పోర్ట్ ఉన్నవారికి 78 దేశాలకు వీసా అవసరం కాగా, తొమ్మిది దేశాలలో ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) అందుబాటులో ఉంది.

ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 179 దేశాలకు వీసా రహిత ప్రవేశంతో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా ర్యాంక్ పొందింది. సింగపూర్ రెండవ స్థానంలో నిలిచింది. తన 30వ స్థానం నుండి 2వ స్థానానికి ఎగబాకి, స్పెయిన్‌తో సమానంగా నిలిచింది. స్పెయిన్ పౌరులు వీసా లేకుండా 175 దేశాలకు ప్రయాణించవచ్చు.

 ఇదిలా ఉండగా, GCC దేశాలలో కువైట్ పాస్‌పోర్ట్ ఖతార్ కంటే కొద్దిగా వెనుకబడి 45వ స్థానంలో నిలిచింది.  సౌదీ అరేబియా మరియు బహ్రెయిన్ పాస్‌పోర్ట్‌లు 48వ స్థానంలో మరియు ఒమన్ 51వ స్థానంలో నిలిచాయి.

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2025లో 168 పాస్‌పోర్ట్ మొబిలిటీ స్కోర్‌ తో 9వ స్థానంలో నలిచింది.  గతేడాది 173 స్కోరుతో 8 స్థానంలో ఉండగా, ఈ ఏడాది ఒక స్థానాన్ని కోల్పోయింది. అదే బాటలో యునైటెడ్ కింగ్‌డమ్  2024లో 174 మొబిలిటీ స్కోర్ తో 7వ ర్యాంకులో ఉండగా ఈ ఏడాది 169 స్కోర్ తో 8వ స్థానంలో నిలిచింది. 

పాస్‌పోర్ట్ ఇండెక్స్ మొత్తం 199 దేశాలను పరిగణనలోకి తీసుకుంది. ఇందులో 193 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల పాస్‌పోర్ట్‌లు మరియు ఆరు ఇతర భూభాగాలు ఉన్నాయి.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com