దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!

- December 13, 2025 , by Maagulf
దుబాయ్‌లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!

దుబాయ్: దుబాయ్ లో పటిష్టమైన భద్రత, సమర్థవంతమైన న్యాయ వ్యవస్థ కారణంగా నేరాల రేటు క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీంతో సమాజంలో దోపిడీ తగ్గి, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి అపారంగా దోహదపడతాయని తెలిపారు.

గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ EY, దుబాయ్ పోలీసులతో కలిసి తయారు చేసిన ఒక తాజా అధ్యయనం ప్రకారం.. దుబాయ్‌లో తక్కువ నేరాలు జరిగే వాతావరణం తగ్గి, ఆర్థిక మరియు సామాజిక సహకారం పరిధిని  పెంచాయని వివరించింది.      

అధ్యయనం ప్రకారం, ఇటీవలి సంవత్సరాలలో దుబాయ్‌లో నేరాల రేటు తగ్గడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు Dh63.9 బిలియన్ల నుండి Dh102.3 బిలియన్ల వరకు మద్దతు లభించిందట. దుబాయ్ పోలీస్.. ఎమిరేట్ భద్రత, న్యాయ వ్యవస్థకు మూలస్తంభంగా ఉందని, ఏటా Dh31.8 బిలియన్ల నుండి Dh50.9 బిలియన్ల వరకు ఆర్థిక సహకారం అందిస్తుందని తెలిపారు.  

దుబాయ్ GDPలో 7-11 శాతానికి సమానంగా ఉందని నివేదిక తెలిపింది. భద్రత చర్యలు పర్యాటకానికి ఊతమిస్తాయని తెలిపారు. దుబాయ్ సురక్షితమైన వాతావరణం ఏటా 7 నుండి 12 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని వెల్లడించారు. 

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (FDI) పరంగా చూస్తే, దుబాయ్ లో సురక్షితమైన వాతావరణం కారణంగా దుబాయ్ వ్యాపార స్థిరత్వంపై ప్రపంచవ్యాప్త విశ్వాసం 2024లో అదనంగా Dh3.6 బిలియన్ నుండి Dh5.8 బిలియన్ల FDIలను ఆకర్షించడానికి దోహదపడింది. దీనికి దుబాయ్ పోలీసుల సహకారం Dh1.8 బిలియన్ నుండి Dh2.9 బిలియన్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఇది దుబాయ్ మొత్తం విదేశీ పెట్టుబడిలో 1-2 శాతానికి సమానంగా ఉంటుందని నివేదికలో తెలిపారు.  

EY అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొఫెషనల్ సర్వీసెస్ నెట్‌వర్క్‌లలో ఒకటి. ఇది ప్రధానంగా సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ మరియు AI వంటి రంగాలలో సేవలను అందజేస్తుంది.  ఈ అధ్యయనం 1995 మరియు 2021 మధ్య 50 దేశాల నుండి డేటాను కలిగి ఉన్న ఎకనామెట్రిక్ విశ్లేషణపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com