నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!

- December 13, 2025 , by Maagulf
నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!

నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!

ASHGABAT:  ఒప్పందాల ద్వారా మాత్రమే శాశ్వత శాంతిని సాధించలేమని సౌదీ అరేబియా పునరుద్ఘాటించింది.  విశ్వాసాన్ని పెంపొందించడం, నిజాయితీ గా ఉండటం, సమ్మిళిత అభివృద్ధి అనేవి స్థిరత్వానికి అవసరమైన స్తంభాలుగా పేర్కొన్నారు. నిజమైన శాంతి అనేది దీర్ఘకాలిక ప్రక్రియ అని డిప్యూటీ విదేశాంగ మంత్రి వలీద్ అల్-ఖురైజీ అన్నారు.  ఇది దశలవారీగా విశ్వాసాన్ని పెంపొందించుకోవడంతో ప్రారంభమవుతుందన్నారు.

తుర్క్మెనిస్తాన్ రాజధాని అష్గాబాత్‌లో జరిగిన అంతర్జాతీయ శాంతి మరియు ట్రస్ట్ ఫోరంలో రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ మరియు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌లకు ప్రాతినిధ్యం వహిస్తూ అల్-ఖురైజీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తుర్క మెనిస్తాన్ తీసుకున్న చొరవకు సౌదీ అరేబియా తరపున కృతజ్ఞతలు తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com