మళ్ళీ తెరపైకి "పుష్పక విమానం" సినిమా టైటిల్
- July 26, 20161987లో కమల్ హాసన్-అమల జంటగా ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన మూకీ చిత్రం "పుష్పక విమానం" గుర్తుంది కదా. ఆ సినిమా మళ్ళీ తెరమీదకొస్తుందనగానే ఆ సినిమాకి సీక్వెల్ వస్తుందేమో అని ఊహించేసుకోకండి. మళ్ళీ తెరపైకి వస్తున్న విషయం వాస్తవమే కానీ.. సినిమా కాదు, ఆ సినిమా టైటిల్.
విషయం ఏంటంటే.. బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి ఓ డిఫరెంట్ మాస్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించనున్నారన్న విషయం తెలిసిందే కదా. రకుల్ ప్రీత్ కథానాయికగా నటించనున్న ఈ చిత్రానికి "అల్లుడు బంగారం" అనే టైటిల్ కూడా ఫీక్స్ చేసేసినట్లు వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పటివరకూ మాస్ మసాలా టైటిల్స్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన బోయపాటికి ఆ టైటిల్ అంతగా నచ్చలేదు. అందుకే కాస్త డిఫరెంట్ గా "పుష్పక విమానం" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది!
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..