కలాం తొలి వర్ధంతి..

- July 26, 2016 , by Maagulf
కలాం తొలి వర్ధంతి..

ఏపీజే అబ్దుల్‌కలాం... ఈ పేరే ఓ స్ఫూర్తిమంత్రం. భారత మిసైల్‌ మాన, దార్శనికత కలిగిన గొప్ప రచయిత, ఎందరో యువతీయువకుల విజయానికి మూల కారకులు, అన్నింటినీ మించి గొప్ప దేశభక్తుడు, 120 కోట్ల భారత ప్రజల మనసులను గెల్చుకున్న ప్రజా రాష్ట్రపతి... ఎంతని చెబుతాం, ఏమని చెబుతాం ఆ మహనీయుడి గురించి. జీవితం మొత్తం దేశం కోసమే పాటుపడిన 'భారతరత్నం' మన అబ్దుల్‌ కలాం. ఆయన మనకు దూరమై అప్పుడే ఏడాది గడిచిపోయింది. బుధవారం కలాం తొలి వర్ధంతిని పురస్కరించుకుని ఘన నివాళులర్పించేందుకు ఆయన మనవడు ఏపీజేఎంజే షేక్‌ సలీమ్‌ నేతృత్వంలోని ఏపీజే అబ్ధుల్‌కలాం ఇంటర్నేషనల్‌ ఫౌండేషన తరపున భారీ ఏర్పాట్లు చేశారు. కలాం మెచ్చిన, ఆచరించిన మార్గంలోనే నివాళులు అర్పించేలా ప్రణాళికలు రూపొందించారు. వివిధ స్వచ్ఛంద, విద్యా, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో కలాం తొలి వర్ధంతిని స్ఫూర్ధిదాయకంగా నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యుల ప్రత్యేక ప్రార్ధనలు...: అబ్దుల్‌కలాం ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కలాం సమాధి వున్న రామేశ్వరం పేకరుంబులో కలాం సోదరుడు మహమ్మద్‌ ముత్తుమీరాన లబ్బై మరకయ్యర్‌ , కుటుంబ సభ్యు లు, బంధువులు, ముస్లిం మత పెద్దలు, అన్నాడీఎంకే ఎంపీ అన్వర్‌రాజా తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. కలాం ఇస్లాం మతానికి చెందినవారు కావడంతో ముస్లిం సంప్రదాయాలతో భక్తిశ్రద్ధలతో జరిపిన ఈ ప్రార్థనలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు.7 అడుగుల కలాం కాంస్య విగ్రహం...: తొలి వర్ధంతి సందర్భంగా బుధవారం పేకరంబులోని సమాధి ఆవరణలో 7 అడుగుల కలాం కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అలాగే జాతీయ స్మారక మందిరం నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరుగనుంది. ఈ రెండింటిని ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స ద్వారా ప్రారంభిస్తారు. పేకరుంబు లోని ఆయన సమాధి ఆవరణలో నిర్వహించనున్న వర్ధంతి సభలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్‌పారికర్‌, పొన.రాధాకృష్ణన, సుభాష్‌ రామ్‌రావ్‌ పామ్రే, రాష్ట్ర మంత్రులు నిలోఫర్‌కపిల్‌, మణికంఠన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, త్రిదళాల అధికారులు పాల్గొంటారని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ప్రకటించింది.రామేశ్వరం చేరిన స్మారక జ్యోతి...: కలాం తొలి వర్ధంతిని పురస్కరించుకుని రామేశ్వరం తరలివచ్చే కలాం అభిమానుల్లో చైతన్యం నింపేలా రెండు వారాల క్రితం చెన్నైలో ప్రారంభించిన స్మారక జ్యోతి యాత్ర మంగళవారం రామేశ్వరం చేరుకుంది. భారత సూపర్‌ బైక్‌ రేసర్‌ దిలీప్‌ రోజర్‌ ఈ యాత్రను ప్రారంభించగా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సామాజికవేత్తలు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, యువతీయువకులచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా రామేశ్వరం వరకు యాత్ర కొనసాగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com