మన శంకరవర ప్రసాద్ గారు ఈ సంక్రాంతికి పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైనర్
- December 14, 2025
-మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి 'మన శంకర వర ప్రసాద్ గారు' షూటింగ్ పూర్తి, జనవరి 12న సంక్రాంతి కానుకగా గ్రాండ్ గా రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'మన శంకర వర ప్రసాద్ గారు'. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్, దూకుడుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలతో సంచలనం సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ రోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు.
'మన శంకర వర ప్రసాద్ గారు' పూర్తి షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు, జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం విడుదల కావడం వల్ల, ఈ చిత్రం ఏడు రోజుల లాంగ్ వీకెండ్ బెనిఫిట్ పొందుతుంది. పండుగ సెలవుల పూర్తిగా కలిసిరానున్నాయి. మంచి ప్లానింగ్ తో చేసిన రిలీజ్ టైం సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద సినిమాకు బలమైన వసూళ్లను అందించి, ప్రేక్షకుల రష్ ని గరిష్ఠంగా పెంచుతుందని భావిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి యంగ్ అండ్ డైమనిక్ గా కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. రెడ్ కార్ పై బ్లాక్ సూట్ లో కాఫీ సిప్ చేస్తూ మెగా స్వాగ్ తో మెస్మరైజ్ చేశారు చిరంజీవి.
చిరంజీవి, అనిల్ రావిపూడిల కలయికే ఇప్పటికే చాలా ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సంచలనం సృష్టించాయి. వెంకటేష్ ప్రత్యేక పాత్ర తోడవడంతో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బలమైన తారాగణం ఉండటంతో అంచనాలు గణనీయంగా పెరిగాయి.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని, తమ్మిరాజు ఎడిటింగ్‌ను, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. కథను ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సంయుక్తంగా రాశారు.
మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మరింత జోరుగా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
గ్రాండ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ అని అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిన్ననే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాం. మీడియా మిత్రులతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా పండగ మొదలుపెట్టాం. ఇది ఒక 20, 30 రోజుల జర్నీ ఉంటుంది. ఈ సినిమాని మేలో మొదలుపెట్టాం. మెగాస్టార్ చిరంజీవి గారితో ఓపెనింగ్ ముహూర్తంతో స్టార్ట్ చేశాం. అక్కడ్నుంచి ఈ ఏడు ఎనిమిది నెలలో జర్నీ నాకు చాలా మెమొరబుల్. నిన్న ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే. నేను ఇంకా ఆ ఎమోషన్ లోనే ఉన్నాను. మేమిద్దరం కూడా ఒక మంచి మెమోరియల్ జర్నీగా షేర్ చేసుకున్నాం. ఒకరినొకరు మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఇద్దరిలో ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి థాంక్యూ సో మచ్. సంక్రాంతి అనగానే నాకు ఒక కనెక్షన్. ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం.. ఇప్పుడు ఇది నా నాలుగో సంక్రాంతి. నాకెప్పుడూ సంక్రాంతి అంటే ఒత్తిడి ఉండదు .హాలిడేస్ లో సరదాగా ఇంటికి వెళ్లి పండగ పూట థియేటర్స్ కి వెళ్లి ఒక మంచి ఎంటర్టైర్నర్ ని చూసే ఒక ఎనర్జీ లాగా ఫీల్ అవుతాను. అందుకే సంక్రాంతి ఎప్పుడు కూడా నా కెరియర్లో చాలా ప్రత్యేకం. లాస్ట్ సంక్రాంతికి మీరు ఎంత ఎనర్జీ ఎంజాయ్ చేశారో, అలాంటి ఎంజాయ్మెంట్ ఈ సంక్రాంతి కూడా మీకు దొరకపోతుంది. చిరంజీవి గారి ఫన్ టైమింగ్ ఏంటో ఒక జనరేషన్ విట్నెస్ చేసింది. ఈ జనరేషన్ కి ఒక అప్డేటెడ్ వెర్షన్ తో చిరంజీవి గారు మన ముందుకు రాబోతున్నారు. చాలా ఫన్, డాన్సులు యాక్షన్ అన్నీ చాలా బాగా కుదిరాయి. ఈ సంక్రాంతికి సూపర్ ఎంటర్టైనర్ ఇది. వెంకటేష్ గారు నాకు చాలా ప్రత్యేకమైన హీరో. ఆయన నా గురువు, మెంటర్. ఈ వేడుక ఆయన బర్త్డే రోజు జరగడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఆయన ఇరవై నిమిషాల బ్లాక్ చేశారు. చిరంజీవి గారితో పాటు ఉంటుంది. చిరంజీవి గారు వెంకటేష్ గారిని దశాబ్దాలుగా వారిని మనం చూస్తూ వస్తున్నాం. అలాంటి ఇద్దరినీ ఒక ఫ్రేమ్ లో చూడాలనేది సినీ లవర్స్ కి ఒక డ్రీమ్ ఉంటుంది. అలాంటి అవకాశం నాకు దొరికింది. చిరంజీవి గారు వెంకటేష్ గారు ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారనేది మీకు చూపించడానికి చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. ఈ సినిమాలో చేసిన వెంకటేష్ గారికి థాంక్యూ. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవత్ కేసరి తర్వాత సాహూ గారితో ఇది నాకు రెండో సినిమా. చాలా ఫ్రెండ్లీగా పని చేస్తాం. సుస్మిత గారు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. చిరంజీవి గారు కుమార్తె అనే ఫీలింగే ఉండదు. షూటింగ్స్ స్పాట్లో అందరితో చాలా సరదాగా కలిసిపోతారు. ఈ సంక్రాంతి సుస్మిత గారికి మరింత మెమొరబుల్ గా ఉంటుంది. సంక్రాంతికి వస్తున్నాం తో పోల్చుకుంటే స్టోరీ పరంగా కొంచెం డెప్త్ ఉన్న సినిమా ఇది. ఫన్ ఎంటర్టైన్మెంట్ తో పాటు బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. చిరంజీవి గారికి నయనతార గారికి, అలాగే ఇందులో ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్లకి చిరంజీవి గారికి వుండే ఎమోషన్ చాలా కనెక్టింగ్ గా వుంటాయి. ఎంటర్టైన్మెంట్ తో పాటు అద్భుతమైన డ్రామా ఉంటుంది. ఇందులో చిరంజీవి గారిని చూసిన ఫస్ట్ ప్రైమ్ లోనే మనం సర్ప్రైజ్ అయిపోతాం. చిరంజీవి గారిని ఆడియన్స్, ఫ్యాన్స్ ఎలా కోరుకుంటారో అలా చూపించడానికి 100% ఎఫర్ట్ పెట్టాను. ఆడియన్స్ కి ఆయన విపరీతంగా నచ్చుతారు.
ప్రొడ్యూసర్ సాహు గారపాటి మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. మీడియా మిత్రులకు ధన్యవాదాలు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ ని నిర్వహిస్తున్నాం. అనుకున్నది అనుకున్నట్లుగా అన్ని సమయానికి ఫినిష్ చేశాం. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి, మేము అడగగానే చేసిన వెంకటేష్ గారికి ,అన్ని పర్ఫెక్ట్ గా క్రాఫ్ట్ చేసిన మా డైరెక్టర్ అనిల్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా సంక్రాంతికి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందులో ఎలాంటి అనుమానం అవసరం లేదు. చిరంజీవి గారిని 30 ఏళ్ల క్రితంఎలా చూసామో ఆయన ఇప్పటికీ అలానే ఉన్నారు. అలానే డాన్స్ లు చేశారు. అభిమానులకి ఒక పండగ లాంటి సినిమా ఇది. ఇండస్ట్రీలోబిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది.
ప్రొడ్యూసర్ సుస్మిత కొణిదెల మాట్లాడుతూ.. అందరికీ గుడ్ ఈవెనింగ్. ఈ వేడుక చూస్తుంటే మా చుట్టాలు అందరితో ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయినట్లు అనిపిస్తోంది. సంక్రాంతి వరకు వెయిట్ చేయలేకపోతున్నట్టుగా ఉంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం అనేది ప్రతి ప్రొడ్యూసర్ కి ఒక కల. నా మొదటి సినిమా అదీ చిరంజీవి గారితో సంక్రాంతికి వస్తుందంటే అది ఎంత పెద్ద కలో నేను ఊహించుకోలేకపోతున్నాను. ఆ కలని మరింత పెద్దగా చేసుకుని సంక్రాంతికి ట్రేడ్ మార్క్ గా నిలిచిన డైరెక్టర్ అనిల్ గారితో రావడం మరింత ఆనందాన్నిస్తుంది. ప్రతిరోజు ఒక పండగ లాగా షూటింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చిన మా కో ప్రొడ్యూసర్ సాహు గారికి థాంక్యూ సో మచ్. మెగాస్టార్ నుంచి అభిమానులు ఆశించే గ్రేస్ స్టైల్ ఫుల్ ఫ్లెడ్జ్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇందులో మూడింతలు వుంటాయి. ఈ సినిమా ఒక ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ఇది నా పర్సనల్ గ్యారెంటీ. మీ అందరి ప్రేమ, ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
నటీనటులు: చిరంజీవి, వెంకటేష్, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి
నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల
బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
సమర్పణ - శ్రీమతి అర్చన
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
డీవోపీ - సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎ.ఎస్. ప్రకాష్
ఎడిటర్ - తమ్మిరాజు
రచయితలు - ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఎస్ కృష్ణ
VFX సూపర్‌వైజర్ - నరేంద్ర లోగిసా
లైన్ ప్రొడ్యూసర్ - నవీన్ గారపాటి
ఎడిషినల్ డైలాగ్స్ - అజ్జు మహంకాళి, తిరుమల నాగ్
చీఫ్ కో-డైరెక్టర్ - సత్యం బెల్లంకొండ
PRO - వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







