దేశ, విదేశాల్లో లైవ్ షోస్ చేయబోతున్నాం: సింగర్ స్మిత
- December 13, 2025
క్వీన్ అఫ్ పాప్ సింగర్ స్మిత ఓజి×మసక మసక సాంగ్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. స్మిత, నోయల్ నటించిన ఈ సాంగ్ ని విజయ్ బిన్నీ అద్భుతంగా డైరెక్ట్ చేశారు. జార్జ్. సి. విలియమ్స్ అదిరిపోయే విజువల్స్ అందించారు. నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా చేసిన ఈ పాటకి అడెలె ఎడిటర్.ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు దేవాకట్టా పాల్గొన్నారు.
సాంగ్ లాంచ్ ఈవెంట్ లో పాప్ సింగర్ స్మిత మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం.నాన్న ఒక థాట్ ని మొదలుపెట్టారు. అమ్మ నన్ను ఎంతగానో ప్రోత్సహించి తన ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ని నా మీద పెట్టింది. హాయ్ రబ్బా ఆల్బమ్ అమ్మ ఇన్వెస్ట్మెంట్ తోనే వచ్చింది. దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఆ తర్వాత అంతా హిస్టరీ. అదే ఇంటి పేరుగా మారింది. ఇప్పుడు ఇంటిపేరు మార్చుకుని 'ఓజి' చేద్దామని అనుకున్నాం. 2026 లో నా లైఫ్ లో కేవలం మ్యూజిక్ మాత్రమే ఉండబోతుంది. మీ అందరూ కూడా అందులో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఈ సాంగ్ ని నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీద లాంచ్ చేశారు. ఆయన కూడా నా జర్నీలో అన్ని రకాలుగా భాగమై ఉన్నారు. ఆయన ప్రోత్సాహం ఎంతో బలాన్ని ఇస్తుంది.నార్త్ ఇండిపెండెంట్ మ్యూజిక్ చాలా పాపులర్ అవుతుంది. సౌత్ లో మాత్రం నేను ఆపినచోటే ఆగిపోయింది. మళ్ళీ అలా ఆగకూడదని ఒక చిన్న బెంగ వచ్చింది. మళ్ళీ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నా. సంక్రాంతికి ఒక పాట వస్తుంది. మేమే పండగ తీస్తున్నాం. ఆ పాట ఒక ఫెస్టివల్ లాగా ఉంటుంది.ఇక పై వరుసగా పాటలు రాబోతున్నాయి.మార్చి చివరి నుంచి లైవ్ షోస్ కూడా ఉంటాయి.హైదరాబాద్, ఆంధ్రాలో రెండు లొకేషన్స్, యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్ లో కూడా ఈవెంట్స్ ఉంటాయి.
డైరెక్టర్ దేవా కట్టా మాట్లాడుతూ...ఇది నాకు ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాంటిది. స్మిత గారి కుటుంబం నా కుటుంబం లాంటిదే. పదేళ్లుగా నా జీవితంలో ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు. చాలా కష్టమైన సమయంలో నాతో పాటు ఉన్నారు. స్మిత ఓజి కాదు మాడ్ మాన్స్టార్ తను ఈ ఆలోచన చెప్పినప్పుడు నాకు చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. తన ఆలోచనలు చాలా క్రేజీగా ఉంటాయి. తను ఫస్ట్ తెలుగు పాప్ స్టార్ గా ట్రెండ్ సెట్టర్. అందరికీ ఇన్స్పిరేషన్.ఈ సాంగ్ నేను చాలా ఎంజాయ్ చేశాను.
డైరెక్టర్ విజయ బిన్నీ మాట్లాడుతూ..ఇదొక బ్యూటిఫుల్ మూమెంట్. నా సినిమా ప్రయాణంలో స్మిత గారు చాలా కీలక పాత్ర పోషించారు.స్మిత నిర్వహించిన డాన్స్ షోలో నేను విన్నర్ గా నిలిచాను. ఆవిడే నాకు డాన్సర్ కొరియోగ్రఫీ కార్డు ఇప్పించారు. ఆ తర్వాత నాగర్జున గారితో పరిచయం ఏర్పడి నా స్వామి రంగా సినిమాకి డైరెక్ట్ చేశాను. ఆ తర్వాత స్మిత ఈ మ్యూజిక్ వీడియో గురించి చెప్పారు. ఆవిడ చెప్పిన వెంటనే నేను చేస్తానని చెప్పను. ఎందుకంటే వారి పట్ల నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను.రెండు అద్భుతమైన పాటలు షూట్ చేసాము. మరో సాంగ్ కూడా రాబోతుంది.
నోయల్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.స్మిత కం బ్యాక్ అందరికంటే ఎక్కువగా హ్యాపీనెస్ నాకే వచ్చింది.ఎందుకంటే వారితో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకున్నాను.స్మిత అంటే అందరికీ ఇష్టం.నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయడానికి ఇన్స్పిరేషన్ స్మిత. ఇండిపెండెంట్ మ్యూజిక్ కి చాలా డెడికేషన్ కావాలి.ఈ పాటలన్నీ కూడా మేము చాలా డెడికేషన్ తో చేశాను. తప్పకుండా మీ అందర్నీ గొప్పగా అలరిస్తాయి.
తాజా వార్తలు
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్
- తిరుమల భక్తులకు శుభవార్త..
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!







