న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్

- December 14, 2025 , by Maagulf
న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్

హైదరాబాద్: హైదరాబాద్ నూతన సంవత్సర వేడుకల కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతుండగా, డిసెంబర్ 31 రాత్రి పార్టీలు నిర్వహించాలనుకుంటున్న 3-స్టార్ హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు, బార్‌లు మరియు రెస్టారెంట్లకు హైదరాబాద్ పోలీసు కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది.

రాత్రి 12 తర్వాత 1 గంట వరకు టికెట్ ఆధారిత ఈవెంట్లు నిర్వహించాలనుకుంటే, నిర్వాహకులు కనీసం 15 రోజుల ముందుగానే పోలీసు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించింది.

ప్రాంగణంలోని ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ ప్రాంతాల్లో CCTV కెమెరాలు ఏర్పాటు చేయాలి. భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ టీమ్ కూడా తగినంతగా ఉండాలన్నారు. ప్రదర్శనల సమయంలో డీసెన్సీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు.

బయట ఏర్పాటు చేసే సౌండ్ సిస్టమ్స్ రాత్రి 10 గంటలకు పూర్తిగా ఆపాలి. ఆపై ఇండోర్ ఈవెంట్లు మాత్రమే రాత్రి 1 గంట వరకు అనుమతించబడతాయి.

తుపాకులు, ఫైర్వర్క్స్, మాదకద్రవ్యాలు పూర్తిగా (New Year party India) నిషేధం. మైనర్లను పబ్‌లు, బార్‌లలో ప్రవేశం ఇవ్వకూడదు. అనుమతిని మించిన రద్దీ ఉంటే నిర్వాహకులపైనే చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

అలాగే మద్యం సరఫరా ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన సమయాలకే పరిమితం. మద్యం సేవించిన కస్టమర్లు సురక్షితంగా ఇంటికి చేరేందుకు క్యాబ్ సేవలు లేదా ప్రత్యామ్నాయ వాహనాల ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత నిర్వహణపైనే ఉంటుందని పోలీసులు తెలిపారు.

డ్రంకెన్ డ్రైవింగ్, చట్టపరమైన మద్యం పరిమితులు, జరిమానాలు, రోడ్డు భద్రత వంటి సూచనలను హోటళ్లు స్పష్టంగా ప్రదర్శించాలని ఆదేశించారు. మార్గదర్శకాలను అతిక్రమించిన ఏ సంస్థపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com