నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- December 14, 2025
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా హైదరాబాద్‌లో సర్వ్ నీడి సంస్థతో కలిసి మడ్‌ఫోర్డ్ మురికివాడ ప్రాంతంలో నిరుపేద బాలలకు అన్నదానం చేసింది.అక్కడే కేక్ కట్ చేసి చిన్నారుల్లో సంతోషాన్ని నింపింది...నిరుపేద పిల్లలకు చక్కటి రుచికరమైన ఆహారాన్ని అందించడంతో పిల్లల్లో ఆనందం ఉప్పొంగింది.తాము చేసిన చిన్న సాయానికి చిన్నారుల మొహాల్లో కనిపించిన ఆనందాన్ని జీవితంలో మరిచిపోలేనని నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. సర్వ్ నీడి ద్వారా గౌతమ్ నిరుపేద బాలల కోసం చేస్తున్న సేవలను ప్రశాంత్ ప్రశంసించారు.సర్వ్ నీడ్‌తో కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు తాము సిద్ధంంగా ఉన్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.భారతదేశంలో ప్రత్యేక సందర్భాలలో భోజనం దానం చేయాలనుకునే ప్రవాస భారతీయులకు (NRIలకు) 'సర్వ్ నీడి' సంస్థ మంచి వేదికగా నిలుస్తోందని నాట్స్ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కిరణ్ మందాడి అన్నారు. భాషే రమ్యం..సేవే గమ్యం అనే నినాదాన్ని విధానంగా మార్చుకున్న నాట్స్ నిరుపేదలకు సాయం చేసే ఎన్నో సంస్థలకు కలిసి పనిచేస్తుంది.పేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు తన వంతు కృషి చేస్తుంది.
తాజా వార్తలు
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్







