'నువ్వు నాకు నచ్చావ్' 4K లో రీ-రిలీజ్
- December 14, 2025
ప్రేక్షకులకు విందు భోజనం తిన్నంత ఆత్మ సంతృప్తి. ఇప్పటికి చాలా సార్లు ఈ చిత్రాన్ని వీక్షించినా కూడా ఇంకా బోర్ కొట్టనంత రిపీట్ వేల్యూ ఉన్న కంటెంట్ ఇది. అందుకే 2026 కొత్త సంవత్సరాన్ని ఈ సినిమా తో చిల్ కావడానికి పూర్తి సాంకేతిక హంగులతో 4 కె లో రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఈ సినిమా అప్పట్లో విదేశాల్లో పూర్తి స్థాయిలో రిలీజ్ కాలేదు. ఆ లోటు ని తీర్చడం కోసం కూడా ఈ సినిమా జనవరి 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమా తీస్తున్నప్పుడే నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ఇది ఒక గొప్ప సినిమా అవుతుందనే నమ్మకంతోనే ఉన్నారు. విక్టరీ వెంకటేష్ ని సరికొత్త పంథా లో ఆవిష్కరించిన సినిమా ఇది. ‘నువ్వే కావాలి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ భాస్కర్- త్రివిక్రమ్ ఫుల్ జోష్ తో చేసిన సినిమా ఇది. అప్పటికే త్రివిక్రమ్ కి ‘మాటల మాంత్రికుడు’ అనే ఇమేజ్ వచ్చేసింది. ఇప్పటకీ ఈ సినిమాలోని డైలాగ్స్ మార్మోగుతూనే ఉన్నాయి. ఇక కోటి సంగీతం, సిరివెన్నెల- భువన చంద్ర ల సాహిత్యం ఎవర్ గ్రీన్. ఆర్తి అగర్వాల్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా, ఎప్పటికీ గుర్తుండి పోతారు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, సునీల్, చంద్ర మోహన్, ఎంఎస్ నారాయణ.. ఇలా చెప్పుకుంటూ పోతే అందరివీ గుర్తుండిపోయే పాత్రలే.
నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ- “ తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయి అయిన “నువ్వు నాకు నచ్చావ్” ఇప్పుడు 4K లో తిరిగి థియేటర్లలోకి వస్తోంది. ఇది కేవలం రీ-రిలీజ్ కాదు. జనవరి 1, 2026 – కొత్త సంవత్సరాన్ని కుటుంబంతో కలిసి నవ్వులు పూయిస్తూ ప్రారంభించడానికి ఇదే సరైన సమయం. 25 ఏళ్లుగా రకరకాల మాధ్యమాల్లో ఆస్వాదిస్తున్న ఈ అనుభూతిని ఇప్పుడు థియేటర్ల లో సంపూర్ణంగా ఆస్వాదించండి. ఈ సినిమా షూటింగ్ 87 రోజులు జరిగింది. ప్రతి రోజూ నాకు గుర్తుంది. ఎక్కడ ఏమేం తీశామో, ఎలా తీశామో, ఒక టీమ్ వర్క్ లాగా ఎంత ఇష్టపడి పని చేశామో అన్నీ గుర్తున్నాయి ” అని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో క్యాబ్ డ్రైవర్లు, బైక్ రైడర్లకు ఉద్యోగాలు..
- తక్కువ ధరలో ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోండిలా!
- డ్రగ్స్ కుట్రను భగ్నం చేసిన యూఏఈ..24 మంది అరెస్టు..!!
- ట్రాఫిక్ ఫైన్ లపై అభ్యంతరం..ఇంకా 15 రోజులే గడువు: టీజీఏ
- ఒమన్ లో ఫేక్ మెడికల్ ఉత్పత్తులపై స్పెషల్ డ్రైవ్..!!
- కువైట్ లో అక్రమ వ్యాపారాలపై రైడ్స్..!!
- బహ్రెయిన్‌లో కొత్త ఇండోర్ క్రికెట్ అకాడమీ.. అన్ని సీజన్లలో శిక్షణ..!!
- హ్యూస్టన్‌లోని పౌరులను ప్రమత్తం చేసిన ఖతార్ కాన్సులేట్..!!
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ









