ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- December 14, 2025
దోహా: వరల్డ్ అట్లాస్ ప్రచురించిన “కంట్రీస్ బై లిటరసీ రేట్ ” ర్యాంకింగ్‌లో ఖతార్ పనితీరు ప్రపంచంలోని మరింత విద్యావంతులైన దేశాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా మిడిలీస్టులో తన హోదాను బలోపేతం చేసుకుంది. ఇటీవలి యునెస్కో మరియు ప్రపంచ బ్యాంకు డేటాను ఆధారంగా చేసుకుని వరల్డ్ అట్లాస్ ర్యాంకులను ప్రకటించింది.
ఖతార్ లో అడల్ట్ లిటరసీ రేట్ 98 శాతంగా ఉంది. ఇది దాదాపు సార్వత్రిక అక్షరాస్యత కలిగిన దేశాల సరసన నిలిపింది. ఖతార్ లో విద్య మరియు మానవ అభివృద్ధిలో దశాబ్దాల నిరంతర కృషిని ఈ ర్యాంకు ప్రతిబింబిస్తుందని విద్యామంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.
వరల్డ్ అట్లాస్ జాబితాలో సౌదీ అరేబియా, సింగపూర్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి అభివృద్ధి చెందిన లేదా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం 98 శాతం అక్షరాస్యత రేటును సాధించాయి.
తాజా వార్తలు
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్







