క్షణాల్లో బస్సు పూర్తిగా దగ్ధం
- July 26, 2016
ఇటీవల కాలంలో రహదారులపై ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల బస్సులు మంటల్లో ధగ్ధమవుతున్న సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఈ ప్రమాదాలను నిలువరించడంలో విఫలం అవుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన ఈ సంఘటనల్లో కొంత మంది ప్రాణాలు కోల్పోతే, మరికొంతమంది అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భంలో ప్రయాణికుల అప్రమత్తమే వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు.
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం వీరేపల్లి వద్ద ఈ తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం మోచెర్ల సమీపంలో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి బయటపడ్డారు.
. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సులోని ప్రయాణికులంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగా, వారి లగేజీ పూర్తిగా దగ్ధమైంది. బస్సు క్లీనర్ వీరేశంకు స్వల్ప గాయాలయ్యాయి. టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







