స్కామ్ అలెర్ట్: గ్యారంటీడ్ రిటర్న్స్ పై నిపుణులు వార్నింగ్..!!
- December 16, 2025
యూఏఈ: యూఏఈలో ఇన్వెస్ట్ స్కామ్స్ పెరగడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నకిలీ పెట్టుబడి ఆఫర్లు పేరిట ప్రసిద్ధ ఆర్థిక సంస్థల పేర్లు, లోగోలను ఉపయోగిస్తూ.. ఆన్‌లైన్ ఎక్కువగా ప్రమోషన్స్ వస్తున్నాయని తెలిపారు. ఇలాంటి వాటిపట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి అధిక గ్యాంరటీడ్ రిటర్న్స్ పై అప్రమత్తంగా ఉండాలని SCA లైసెన్స్ పొందిన మార్కెట్ విశ్లేషకుడు ముహమ్మద్ అలామర్ హెచ్చరించారు. చట్టబద్ధంగా పనిచేసే ఆర్థిక మార్కెట్లు అటువంటి పెట్టుబడులను అందించవని ఆయన తెలిపారు. ఎక్కువ మంది నివాసితులు పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నందున ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
అధిక గ్యాంరటీడ్ రిటర్న్స్ పేరిట జరుగుతున్న స్కామ్ లు మోసాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయని అలామర్ అన్నారు. “ఎవరైనా మీకు నెలవారీగా 10, 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ రిటర్న్స్ ను ఇస్తామని చేప్తే, అది కచ్చితంగా మోసం అని అర్థం” అని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమంగా పనిచేసే మార్కెట్ రంగ కంపెనీలు కూడా ఈ స్థాయిలో రిటర్న్స్ ఇవ్వవని గుర్తు చేశారు. పైగా ఇన్వెస్టర్లను ఆలోచించకుండా చేసేందుకు ఆఫర్ త్వరలో ముగ్గుస్తుంది, వెంటనే పెట్టుబడులు పెడితే డిస్కౌంట్ పేరిట ప్రకటనలు ఇస్తారని హెచ్చరించారు. ఇలాంటివి ఉండే కచ్చితంగా ఆలోచించాలని, అలాంటి వాటి జోలికి వెళ్లవద్దని సూచించారు. చట్టబద్ధమైన పెట్టుబడి సంస్థలు, ప్రత్యేకమైన పెట్టుబడి అవకాశాలను అందిస్తామని వాట్సాప్ లేదా సోషల్ మీడియా కాల్‌లను నమ్మదగిన కంపెనీలు చేయవని ఆయన గుర్తుచేశారు.
మోసగాళ్ళు తరచుగా నకిలీ లోగోలు, డాక్యుమెంట్స్, యూఏఈ ఫోన్ నంబర్లు మరియు అధికారిక నియంత్రణ సంస్థల రిపోర్టులు, ప్రొఫెషనల్‌గా కనిపించే ఇమెయిల్ చిరునామాలను ఉపయోగించి ప్రమోషన్లు చేస్తారని, సాధారణంగా వీటిని గుర్తించడం కష్టమని, కానీ అప్రమత్తంగా ఉంటే ఇలాంటి వాటిని సులభంగా గుర్తించవచ్చని పరిశ్రమ విశ్లేషకుడు ఇబ్రహీం ఎల్ షేక్ తెలిపారు.
లైసెన్స్ లేని పెట్టుబడి కార్యకలాపాల కేసులు పెరుగుతున్నందున యూఏఈ అధికారులు ఇటీవల హెచ్చరికలను జారీ చేశారు. డిసెంబర్ 12న సెక్యూరిటీస్ అండ్ కమోడిటీస్ అథారిటీ XC మార్కెట్ లిమిటెడ్ మరియు XCE కమర్షియల్ బ్రోకర్స్ LLC అనే రెండు సంస్థలపై హెచ్చరించారు. వాటికి యూఏఈలో నియంత్రిత ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతి లేదని తెలిపింది. అంతకుముందు, డిసెంబర్ 3న గల్ఫ్ హయ్యర్ అథారిటీ ఫర్ ఫైనాన్షియల్ కండక్ట్ అనే లైసెన్స్ లేని సంస్థ గురించి పెట్టుబడిదారులను హెచ్చరించింది. ఇదిhttp://financialgcc.com వెబ్‌సైట్ ద్వారా ఆర్థిక నియంత్రణ సంస్థగా తప్పుగా ప్రచారం చేసుకుంటుందని పేర్కొంది. నవంబర్‌లో దుబాయ్ పోలీసులు ఆన్‌లైన్ పెట్టుబడి ఆఫర్‌ల పెరుగుదలపై అలెర్ట్ జారీ చేశారు. ఇలాంటి ఫ్రాడ్ సంస్థలు 10 శాతం వరకు నెలవారీ రాబడిని హామీ ఇస్తున్నారని తెలిపారు. ఇలాంటి ప్రకటనపై జాగ్రత్తగా ఉండాలని, అనుమానస్పద ప్రకటనలపై తమకు సమాచారం అందజేయాలని కోరారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్లు వీరే!
- జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి
- మెడికవర్ హాస్పిటల్స్ లో 'న్యూరో స్టెంటింగ్' ద్వారా 69 ఏళ్ళ మహిళ కొత్త జీవితం
- చంద్రబాబు పాలనపై వైఎస్ జగన్ సంచలన కామెంట్స్..
- బహ్రెయిన్ లో సివిల్ డిఫెన్స్ సేఫ్టీ క్యాంపెయిన్ ప్రారంభం..!!
- MMA ఛాంపియన్షిప్.. సిల్వర్ మెడల్ సాధించిన ఇషాక్..!!
- ఫామ్, క్యాంప్ ఓనర్లను హెచ్చరించిన ఖతార్..!!
- వెదర్ అలెర్ట్..ముసందమ్లో భారీ వర్షాలు..!!
- స్కామ్ అలెర్ట్: గ్యారంటీడ్ రిటర్న్స్ పై నిపుణులు వార్నింగ్..!!
- తొలి మిడ్ ఈస్ట్ సిటీగా చరిత్ర సృష్టించిన రియాద్..!!







